White Hair: టీనేజ్ లోనే వెంట్రుకలు తెల్లబడ్డాయా..?.. ఈ తప్పులు అస్సలు చేయోద్దు..

White Hair Effects: మనలో చాలా మందికి టీనేజ్ లోనే వెంట్రుకలు తెల్లబడుతుంటాయి. దీంతో చాలా ఇబ్బందులు పడుతుంటారు. మొదట కొన్ని ఉన్న వెంట్రులకు తర్వాత జుట్టంతా పూర్తిగా తెల్లగా మారిపోతుంది.

1 /6

ఈ మధ్య కాలంలో చాలా మందికి చిన్న వయసులోనే జుట్టంతా నెరసిపోతుంది. జుట్టులో మొదట కొన్ని తెల్లని వెంట్రుకలు వస్తున్నాయి. ఆ తర్వాత జుట్టంతా తెల్లగా మారిపోతుంది. కొందరు తెల్ల వెంట్రుకలను పీకేస్తుంటారు.  

2 /6

తెల్ల జుట్టును అస్సలు పీకొద్దని నిపుణులు చెబుతుంటారు. పీకేసిన స్థానంనుంచి ఎక్కువ సంఖ్యలో తెల్లని వెంట్రుకలు మొలుస్తాయి. క్రమంగా జుట్టంతా తెల్లగా మారిపోతుంది. దీంతో యువత మరింత టెన్షన్ కు గురౌతారు.   

3 /6

జుట్టు తెల్లగా మారడానికి జన్యులోపం, ఒత్తిడి, థైరాయిడ్ సంబంధిత సమస్యలు కారణమని వైద్యులు చెబుతుంటారు. ఆటో ఇమ్యున్ సమస్య వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. విటమిన్ బీ12 లోపం వల్ల జుట్టు తెల్లగా మారుతుంది.

4 /6

కొందరు విపరీతంగా స్మోకింగ్ చేస్తుంటారు. ఇలాంటి వారిలో కూడా జుట్టు తొందరగా నెరుస్తుంటుంది. జుట్టు తెల్లగా ఉన్న వారు.. హెన్నాలను పెట్టుకుంటారు. ఇది పెట్టడం ప్రారంభిస్తే ప్రతిసారి పెట్టుకొవాలి. దీంతో జుట్టు మరింతగా తెల్లబడుతుంది.

5 /6

మందార పువ్వులను ఎండలో నానబెట్టాలి. దీనితో తీసిన పొడిని వేడినూనెలో వేయాలి. ఆ పొడితో నూనెను తయారు చేసి ప్రతిరోజు తలకు అప్లై చేయాలి. బైక్ మీద వెళ్లే వారు హెల్మెట్ ధరించాలి. 

6 /6

హెల్మెట్ వేసుకునే ముందు కడ్చీఫ్ తలకు కట్టుకొవాలి. లేకుంటే వెంట్రుకలు ఊడిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)