Ramnath Kovind Committee: దేశంలో లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాకంలో ఎన్నికలు జరిపించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ జమిలీ ఎన్నికలపై సాద్యాసాధ్యాలు పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పడిన కమిటీ నివేదికను ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ఈ నివేదికలోని కీలకాంశాలు ఇవే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఒకే సమయంలో అన్ని ఎన్నికలు జరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం 2023 సెప్టెంబర్ నెలలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీకు ఛైర్మన్ కాగా, కేంద్ర మంత్రి అమిత్ షా, లోక్‌సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదురి, గులాం నబీ ఆజాద్, 15వ ఆర్ధిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, మాజీ విజిలెన్స్ కమీషనర్ సంజయ్ కొఠారీలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ 190 రోజుల పాటు దేశంలోని వివిధ ప్రాంతాలు తిరిగి, విభిన్న వర్గాల ప్రజలతో సమావేశమై సలహాలు, సూచనలు స్వీకరించింది. అన్నింటినీ క్రోడీకరించి 18, 626 పేజీల నివేదిక తయారు చేసింది. ఈ నివేదికను ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది. 


జమిలీ ఎన్నికలపై రామ్‌నాథ్ కమిటీ సూచనలు


మొదటి దశలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిపించాలి
రెండవ దశలో 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలకు ఒకటే ఉమ్మడి ఓటర్ల జాబితా ఉండాలి
జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం ఐదు ఆర్టికల్స్ సవరణ చేయాలి


మొత్తానికి రాజ్యాంగ సవరణలు మినహా మిగిలినవన్నీ చిన్న చిన్న సూచనలే. రాజ్యాంగ సవరణలు కూడా పూర్తయితే ఇక జమిలీ ఎన్నికలకు అడ్డంకి లేనట్టే. 2029లో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయవచ్చని కమిటీ సిఫారసు చేసింది. 


Also read: Ban on Dogs: ఆ కుక్కలపై నిషేధం విధించనున్న కేంద్రం, పిట్‌బుల్, షెఫర్డ్ డాగ్స్ కూడా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook