Simranjit Singh Mann controvercy comments on Kangana: బీజేపీ ఫైర్ బ్రాండ్, ఎంపీ కంగానా రనౌత్ మరోసారి వార్తలలో నిలిచారు. కంగాన.. రైతులు చేపట్టిన నిరసనలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కంగానా మాట్లాడుతూ.. రైతుల నిరసనలు వెనుక చైన,అమెరికాలు కుట్రపూరితంగా ఉన్నాయంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. దేశంలో ప్రధాని మోదీ బీజేపీ వంటి పటిష్టమైన నాయకత్వం ఉండటం వల్ల మనం అన్నిరంగాల్లో దూసుకుపోతున్నామని అన్నారు. ఒక వేళ కేంద్రంలో బీజేపీ లేకుంటే.. బంగ్లాకు పట్టిన గతి మనకు పట్టేదంటూ కూడా ఆమె మాట్లాడారు.  ఇదిలా ఉండగా.. కంగానా రైతుల నిరసలను ఉద్దేశించి.. చేసిన వ్యాఖ్యలను రైతు సంఘాలు ఖండించాయి.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహారించుకొవాలని తాము నిరసనలు చేశామని, తమ న్యాయపూరితమైన నిరసనలపై కంగానా చేసిన వ్యాఖ్యల్ని ఖండించాయి. ఇది కాస్త పొలిటికల్ టర్న్ తీసుకొవడంతో కంగానా వ్యాఖ్యలపై బీజేపీ కూడా నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కంగానా వ్యాఖ్యలు ఆమె వరకు మాత్రమే.. అని పార్టీ పరంగాకాదని క్లారిటీ ఇచ్చింది. కంగానాకు ఇక మీదట వివాదస్పద వ్యాఖ్యలు చేయోద్దని కూడా గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది.


ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దేశంలో కోల్ కతా ఘటన తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. మరోవైపు.. సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ పై కూడా రచ్చ నడుస్తోంది. ఈ క్రమంలో..దీనిపై కంగానా కూడా తనదైన విధంగా స్పందించారు. ఇదిలా ఉండగా.. పంజాబ్ మాజీ ఎంపీ, శిరోమణి అకాళిదళ్ కు చెందిన సీనియర్ నేత సిమ్రాన్ జిత్ సింగ్ మాట్లాడుతూ .. కంగానాకు అత్యాచారాల్లో చాలా అనుభవం ఉందని వివాదాస్పదంగా మాట్లాడారు.


Read more: Supreme court: ఓటుకు నోటు కేసు.. సీఎం రేవంత్ పై మండిపడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అసలేం జరిగిందంటే..?


అంతేకాకుండా.. రైతుచట్టాలలో నిరసనలు చేపట్టినప్పుడు.. రేప్ లు, హత్యలు జరిగాయని చాలా మంది అంటున్నారని ఆయన సెటైరికల్ గా మాట్లాడారు. సైకిల్ నడిపేవాళ్లు.. సైకిల్ ఎలా నడిపిస్తారో.. అనుభవం ఉంటుందని, అలాగే.. కంగానాకు రేప్ లో చాలా అనుభవం ఉందని.. అందుకే రేప్ లు ఎలా జరుగుతుందో ప్రజలకు చెప్పాలని కూడా సిమ్రాన్ జిత్ సింగ్ అన్నారు. ప్రస్తుతం ఇది కాస్త దుమారంగా మారాయి. ఒక ఎంపీని పట్టుకుని  ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా బీజీపీ మండిపడుతుంది. దీనిపై మహిళ కమిషన్ కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.