Four dead after drinking illicit alcohol: లక్నో: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లో దారుణం చోటుచేసుకుంది. కల్తీ మద్యం (illicit liquor) తాగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదారుగురు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ జిల్లా పుల్పూరు పోలీసుస్టేషన్ పరిధిలోని అమిలియా గ్రామంలో చోటుచేసుకుంది. అయితే కల్తీ మద్యం తాగి ఇప్పటివరకు నలుగురు మరణించారని, మరో ఐదారుగురిని ఆసుపత్రిలో చేర్చామని ప్రయాగరాజ్ జిల్లా డీఎం భానుచంద్ర గోస్వామి పేర్కొన్నారు. Also raed: Delhi to Mumbai flights, trains: ఢిల్లీ నుంచి రైళ్లు, విమానాలు బంద్ ?



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కల్తీ మద్యం తాగడం వల్ల నలుగురు మరణించారనే వార్త తెలుసుకున్న అధికారుల బృందం ఫుల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమిలియా గ్రామానికి చేరుకుంది. కల్తీ మద్యం శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. మృతులను పోస్టుమార్టం కోసం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు కొనసాగుతుందని ఈ ఘటనకు కారణమైన కల్తీ మద్యం విక్రేతలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎం భానుచంద్ర గోస్వామి తెలిపారు. Also read: Good News: ఫిబ్రవరి నాటికి కరోనా వ్యాక్సిన్: సీరం సీఈవో పూనావాలా


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి