Covid19 Vaccines: కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో ఇప్పుడున్న వ్యాక్సిన్లకు తోడుగా మరో నాలుగు వ్యాక్సిన్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా వ్యాక్సినేషన్(Corona Vaccination) ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కోవాగ్జిన్, సీరమ్ ఇనిస్టిట్యూట్(Serum institute) ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు తోడుగా రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి అందుబాటులో ఉన్నాయి. ఈ నేపధ్యంలో మరో నాలుగు వ్యాక్సిన్లు సిద్ధంగా ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. దేశంలో వ్యాక్సిన్ల అందుబాటుపై రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ సమాధానం ఇచ్చారు. 


క్యాడిల్లా(Cadilla vaccine)హెల్త్ కేర్ అభివృద్ధి చేస్తున్న డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని..అత్యవసర వినియోగం కోసం డేటా సమర్పించిందని మంత్రి తెలిపారు. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ (Biological E vaccine)అభివృద్ది చేసిన వ్యాక్సిన్ కూడా మూడవ దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉందన్నారు. ఇక ముక్కులో వేసే భారత్ బయోటెక్ (Bharat Biotech) వ్యాక్సిన్ సైతం మూడవ దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉందని తెలిపారు. ఇవి కాకుండా జెన్నోవా బయో ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌కు చెందిన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ మొదటి దశ ట్రయల్స్‌లోనూ, గుర్గావ్‌కు చెందిన జెనిక్ లైఫ్ సైన్సెస్ వ్యాక్సిన్ అడ్వాన్స్‌డ్ ప్రీ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. 


Also read; Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామాకు రంగం సిద్ధం, జూలై 26న రాజీనామా చేసే అవకాశాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook