4 Trains: బాప్ రే.. ఒకే ట్రాక్ మీదకు నాలుగు ట్రైన్ లు.. స్పందించిన రైల్వేశాఖ.. వీడియో వైరల్..
4 Trains in single track: కొన్నిరోజులుగా వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు తెగ ఆందోళనలు కల్గిస్తున్నాయి. ప్రమాదాలు జరగ్గానే ఏదో హడావిడి చేసి మరల ఇండియన్ రైల్వేస్ అదే విధంగా నెగ్లీజెన్సీగా ఉంటుందని కూడా తరచుగా వార్తలు వస్తున్నాయి.
four trains came in a single railway track in odisha bhubaneswar video viral: ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. కొన్నిసార్లు రైల్వే ప్రమాదాల వల్ల భారీగా ప్రాణ నష్టం ఉంటుంది. చాలా మంది దూర ప్రాంతాలకు ఎక్కువగా రైల్వేలను ఉపయోగించుకుంటారు. రైలులోనే ఎక్కువగా మంది జర్నీలకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రైళ్లన్ని ఎప్పుడు కూడా కిటకిటలాడుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇటీవల రైలు ప్రమాదాలు తెగ ఇబ్బందులు పెడుతున్నాయి. ముఖ్యంగా రైల్వేలలో సిగ్నలింగ్ లోపం తరచుగా బైటపడుతుంటుంది. ఆగి ఉన్న రైలును మరో రైలు ఢీకొట్టడం,ఒక రైలు మీదకు మరో రైలు ఎక్కేయడం వంటి ఘటనలు వార్తలలో నిలిచాయి.
రైలు ప్రమాదాలు జరగ్గానే ముఖ్యంగా కవచ్ వ్యవస్థ బైటకు వస్తుంది. దీని వల్ల.. ఒకే ట్రాక్ మీదకు ట్రైన్ లు రాగానే సిగ్నలింగ్ అలర్ట్ వెళ్తుంది. కానీ ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో.. అధికారులు మాత్రం కవచ్ వ్యవస్థను తీసుకొచ్చేలా చర్యలు చేపట్టారు. రైల్వే ప్రమాదాలకు ఎక్కువగా సిగ్నలింగ్ సమస్యలు కారణమని కూడా చెప్పుకొవచ్చు.ఇదిలా ఉండగా.. రైల్వేకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గామారింది. ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు రైళ్లు ఒకే ప్లాట్ ఫామ్ మీదకు రావడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..
ఒడిశాలోని భువనేశ్వర్ లోని లింగరాజ్ స్టేషన్ వద్ద నాలుగు రైళ్లు ఒకే ట్రాక్ మీదకు వచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. భువనేశ్వర్ లోని లింగ్ రాజ్ రోడ్డు పాసింజర్ హాల్ట్ దగ్గర ఒకే ట్రాక్ మీదకు నాలుగు రైళ్లు వచ్చాయి. దీనిపైన ఇండియన్ రైల్వేస్ క్లారిటీ ఇచ్చింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు దీనిపై మాట్లాడుతూ... ఇది భద్రతా లోపం కాదన్నారు.
Read more: Dream about snakes: కలలో పాములు తరచుగా కన్పిస్తున్నాయా..?.. ఇది మీకోసమే.. అస్సలు మిస్ అవ్వొద్దు..
కొన్ని సెక్షన్ లలో కెపాసిటీ, భద్రతను పెంచడం ఈ టెక్నాలజీ ఉద్దేష్యమని అధికారులు తెలిపారు.ప్రతిరోజు వందలాది ట్రైన్ లు రాకపోకలు సాగిస్తాయని క్లారీటీ ఇచ్చారు. ఈ ఘటనను వివాదాస్పదం చేయడం మానుకొవాలని రైల్వే అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి