Dream about snakes: కలలో పాములు తరచుగా కన్పిస్తున్నాయా..?.. ఇది మీకోసమే.. అస్సలు మిస్ అవ్వొద్దు..

Snakes in dream: కొందరికి పాములు ఎక్కువగా కలలో కన్పిస్తుంటాయి. దీని వల్ల కొందిరికి శుభఫలితాలు కల్గితే, మరికొందరికి చెడు ఫలితాలు కూడా కల్గుతాయి. జ్యోతిష్య పండితులు పాములు కలలో తరచుగా పడుతుంటే కలిగే ఫలితాలను ఈవిధంగా వివరించారు.
 

1 /6

పాములను చాలా మంది దైవంలాగా కొలుస్తారు. పామును శివుడు మెడలో ధరించాడు. అదే విధంగా శ్రీ మహవిష్ణువు తన పాన్పులాగా పెట్టుకున్నాడు. సుబ్రహ్మణ్యుడిని  పాము అవతారంగా కూడా చెప్తుంటారు. అందుకే పాములకు పొరపాటున కూడా అపకారం కల్గించకూడదని చాలా మంది పండితులు తరచుగా చెప్తుంటారు.   

2 /6

అందుకే హిందు సంప్రదాయాలలో పామును పూజిస్తుంటారు. ముఖ్యంగా నాగ పంచమి రోజున పాముల్ని తప్పకుండా పూజిస్తారు. పాములున్న పుట్టలో పాలు పొస్తుంటారు. కొందరు పాముల ప్రతిమపై పాలతో అభిషేకం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కొందరికి తరచుగా పాములు కలలో కన్పిస్తుంటాయి. దీనివెనుక ఉన్న అసలు రహస్యాన్ని పండితులు ఈ విధంగా తెలియజేశారు.  

3 /6

పాములు కలలో కన్పిస్తే అలాంటి వారికి కాలసర్ప దోషం ఉందని పండితులు చెబుతుంటారు. ఒక వేళ పాము కాటు వేసినట్లు లేదా కోపంతో పడగ విప్పి చూస్తుంటే మాత్రం.. ఏదో గత జన్మలో పాములకు అపకారం చేసిఉంటారని చెప్పవచ్చు. పాములు చూసే విధానంను బట్టి దాని ఫలితాలు చెబుతుంటారు.

4 /6

పాములు మనకు కుడివైపు నుంచి ఎడమకు దాటుకుంటూ పోతే.. మనలోని దోషాలు అన్ని పోయినట్లుగా భావించవచ్చు. అదే పాము మనకు ఎడమ నుంచి కుడివైపుగా దాటకూడదంటారు. పామును తొక్కినట్లు కూడా కలలో రావద్దని చెబుతుంటారు.   

5 /6

పితృ దోషం ఉన్న వారిలో పాములు కలలో తరచుగా కన్పిస్తు ఉంటాయంట. అంతేకాకుండా.. గత జన్మలో పాములకు ఆపద కల్గించిన వాళ్లకు మాత్రమే.. పాములు ఎక్కువగా కలలో కన్పిస్తుంటాయంట.

6 /6

నిధి, డబ్బులు, ఉన్న వారి ఇంట్లో కూడా పాములు ఎక్కువగా కన్పిస్తాయంట. అందుకే చాలా మంది పాములు కన్పిస్తే.. వెంటనే పూజారులను సంప్రదిస్తుంటారు. పాముల కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. పాములు కన్పిస్తే వెంటనే స్నేక్ సొసైటీవారికి సమాచారం ఇస్తే పాములను వాళ్లు బంధించి తీసుకొని వెళ్తారు.   (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)