India Covid-19 Update: దేశంలో కొవిడ్ కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,781 కేసులు (Corona  cases in India) వెలుగు చూశాయి. వైరస్ తో మరో 18 మంది ప్రాణాలు విడిచారు. మహమ్మారి నుంచి 8,537 మంది కోలుకున్నారు. దీంతో టోటల్ కోలుకున్నవారి సంఖ్య 98.62 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా నమోదైంది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.17 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.32 శాతంగా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 43,309,473 కరోనా కేసులు నమోదు కాగా.. మెుత్తంగా 5,24,873 మరణాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం 76,700 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ (Covid-19 vaccination) ప్రక్రియ స్థిరంగా కొనసాగుతోంది. ఆదివారం 2,80,136 మందికి టీకాలు పంపిణీ చేశారు. మెుత్తంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,96,18,66,707 కోట్లకు చేరింది.  మరో 2,96,050 మందికి కరోనా పరీక్షలు చేశారు.



ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. గత 24 గంటల్లో 259,150 మంది వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో 563 మరణాలు చోటుచేసుకున్నాయి. తైవాన్ లో రికార్డు స్థాయిలో 50వేలకుపైగా కేసులు, 172 మరణాలు వెలుగుచూశాయి. ఇటలీలో 30వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.


Also Read: Agnipath Protests: అగ్నిపథ్ స్కీమ్‌పై దుష్ప్రచారం.. 35 వాట్సాప్ గ్రూపులపై కేంద్రం నిషేధం



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook