Fourth Wave Scare: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్త కేసులన్నంటే!
Covid-19: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 16,464 మందికి వైరస్ బారిన పడగా.. మరో 39 మంది ప్రాణాలు కోల్పోయారు.
India Corona Updates: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు కొవిడ్ కేసుల తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 16,464 మందికి కరోనా వైరస్ (Corona Cases in India) సోకింది. మహమ్మారితో మరో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి 16,112 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.48 శాతానికి చేరింది. దేశంలో మెుత్తం కేసుల సంఖ్య 4,40,36,275 కాగా.. టోటల్ మరణాల సంఖ్య 5,26,396గా ఉంది. భారత్ లో రికవరీ అయినవారి సంఖ్య 4,33,65,890గా నమోదైంది.
దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,43,989గా నమోదైంది. నిన్న మరో 2,73,888 మందికి కరోనా టెస్టులు చేశారు. భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం స్థిరంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్క రోజే 8,34,167 మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 204.34 కోట్లు దాటింది.
వరల్డ్ వైడ్ గా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 5,79,258 మందికి వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వైరస్ తో మరో 816 మంది ప్రాణాలు కోల్పోయారు. జపాన్‌లో 2,12,960 కేసులు వెలుగు చూడగా.. మరో 91 మంది మరణించారు. దక్షిణ కొరియాలో 73,589 కేసులు నమోదయ్యాయి.
Also Read: EPFO: పెన్షన్‌దారులకు ఈపీఎఫ్‌వో గుడ్‌న్యూస్..లైఫ్ సర్టిఫికెట్ ఇలా పొందవచ్చు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook