ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ, చెక్‌ బుక్‌ జారీ, వంటి ఉచిత బ్యాంకింగ్‌ సేవలపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వర్తించదని కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. దీంతో పాటు సెక్యూరిటీ లావాదేవీలు, డెరివేటివ్స్‌, ఫ్యూచర్‌, ఫార్వార్డ్‌ కాంట్రాక్టులకు సంబంధించిన లావాదేవీలను సైతం జీఎస్‌టీ నుంచి మినహాయించింది. అయితే క్రెడిట్‌ కార్డ్‌ బిల్లులపై విధించే లేట్ పేమెంట్ చార్జీలు, ఎన్‌ఆర్‌ఐల బీమా పాలసీల కొనుగోలుపై మాత్రం జీఎస్‌టీ ఉంటుందని పేర్కొంది.


‘ఎన్‌ఆర్‌ఐలు చెల్లిస్తున్న మొత్తం రూపాయిలో ఉంటోంది. మార్పిడి చేసే వీలున్న విదేశీ మారకంలో అందుకోవడం లేదు’ అని తెలిపింది. మ్యూచువల్‌ ఫండ్‌ల విక్రయంలో వేసే ఎగ్జిట్‌ లోడ్‌పై జీఎస్‌టీ విధించనున్నట్లు పేర్కొంది. వీటితో పాటు క్రెడిట్‌ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లిస్తే వేసే ఛార్జీలు, ఫైనాన్స్‌ లీజు లావాదేవీలపై వేసే వడ్డీ కూడా జీఎస్‌టీ పరిధిలోకి వస్తాయని తెలిపింది.