Covid 19 cases in India: దేశంలో కరోనా వైరస్ మరోసారి సునామీ తరహాలో విరుచుకుపడుతోంది. గత 3 రోజులుగా దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల సంఖ్య లక్ష దాటేసింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,59,632 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 327 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 4,83,790కి చేరింది. ఇప్పటివరకూ 3,44,53,603 మంది కరోనా నుంచి కోలుకున్నారు. . ఇప్పటివరకూ 3,44,53,603 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 5,90,611 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకూ 151.58 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ జరిగింది. ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 10.21శాతంగా ఉంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరుసగా మూడో రోజు లక్ష దాటిన కేసులు :


దేశంలో 8 రోజుల వ్యవధిలోనే కోవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. గడిచిన 214 రోజుల్లో తొలిసారిగా శుక్రవారం (జనవరి 7) కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. ఆ ఒక్కరోజే 1,17,000 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం 1,41,986 కేసులు నమోదవగా... నేడు (జనవరి 9) 1,59,632 కేసులు నమోదయ్యాయి. 


ఇదే పరిస్థితి కొనసాగితే పరిశోధకులు హెచ్చరిస్తున్నట్లు భారత్‌లో వచ్చే నెల నాటికి కరోనా పీక్స్‌కి చేరుకోవచ్చు. అదే జరిగితే రోజుకు 5లక్షల కేసులు నమోదైనా ఆశ్చర్యం లేదంటున్నారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందడం వల్లే కేసుల సంఖ్య పెరగవచ్చునని చెబుతున్నారు. అయితే డెల్టా పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత అంతగా లేదు కాబట్టి పెద్దగా భయపడాల్సిన పని లేదని కొంతమంది వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
 


ఒమిక్రాన్ కేసులు :


దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య (Omicron cases in India) 3623కి చేరింది. ఒమిక్రాన్ బారినపడినవారిలో 1409 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ అత్యధికంగా మహారాష్ట్రలో 1009, ఢిల్లీలో 513, కర్ణాటకలో 441, రాజస్తాన్‌లో 373 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.



 Also Read: Weather Alert: తెలంగాణలో నేటి నుంచి 3 రోజుల పాటు వడగళ్ల వానలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి