Weather Alert: తెలంగాణలో నేటి నుంచి 3 రోజుల పాటు వడగళ్ల వానలు

Telangana Weather Report : తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు వడగళ్ల వర్షం కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆది, సోమ, మంగళవారాల్లో (జనవరి 9,10, 11) రాష్ట్రంలోని పలుచోట్ల ఒక మాదిరి వడగళ్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2022, 08:56 AM IST
  • తెలంగాణలో నేటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు
  • పలుచోట్ల వడగళ్లు కురిసే సూచన
  • ఆది, సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా వర్షాలు
 Weather Alert: తెలంగాణలో నేటి నుంచి 3 రోజుల పాటు వడగళ్ల వానలు

Telangana Weather Report : తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు వడగళ్ల వర్షం కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆది, సోమ, మంగళవారాల్లో (జనవరి 9,10, 11) రాష్ట్రంలోని పలుచోట్ల ఒక మాదిరి వడగళ్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయువ్య భారత ప్రాంతాల్లో వీస్తున్న గాలుల్లో అస్థిరత నెలకొందని.. ఆగ్నేయ, దక్షిణ భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని పేర్కొంది. ఈ గాలుల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది.

తెలంగాణలో హైదరాబాద్, దాని శివారు ప్రాంతాల్లో వచ్చే నాలుగు రోజుల పాటు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రం వైపు వీస్తున్న గాలుల ప్రభావంతో చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందని..  అదే సమయంలో ఉత్తర భారతం వీస్తున్న గాలులతో మంచు పొరలు ఏర్పడవచ్చునని వెల్లడించింది. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

దేశ రాజధాని ఢిల్లీ (Delhi), నగర శివారు ప్రాంతాల్లో శనివారం (జనవరి 8) భారీ వర్షం నమోదైంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఢిల్లీని ముంచెత్తింది. ఆదివారం (జనవరి 9) కూడా ఆకాశం నీలావృతమై ఉంటుందని... పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Also Read: Horoscope Today January 9 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి కలలు నిజమయ్యే రోజు..

Also Read: Ramesh Babu: రమేష్ బాబు నటనకు ఎందుకు దూరమయ్యారు.. హీరోగా ఎందుకు విఫలమయ్యారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News