Joe Biden`s Air Force One Flight: ఢిల్లీలో దిగిన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానం
Joe Biden`s Air Force One Flight: భారత్‌లో జరగనున్న G20 సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఢిల్లీకి చేరుకున్నారు. జో బిడెన్ తరహాలోనే G20 సదస్సుకి హాజరయ్యేందుకు G20 దేశాల అధినేతలు ఒక్కొక్కరుగా ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఎన్ని దేశాల అధినేతలు వచ్చినా.. అందరి దృష్టి మాత్రం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రయాణించి వచ్చిన ఎయిర్ ఫోర్స్ విమానంపైనే ఉంది.
Joe Biden's Air Force One Flight: భారత్‌లో జరగనున్న G20 సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఢిల్లీకి చేరుకున్నారు. జో బిడెన్ తరహాలోనే G20 సదస్సుకి హాజరయ్యేందుకు G20 దేశాల అధినేతలు ఒక్కొక్కరుగా ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఎన్ని దేశాల అధినేతలు వచ్చినా.. అందరి దృష్టి మాత్రం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రయాణించి వచ్చిన ఎయిర్ ఫోర్స్ విమానంపైనే ఉంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడి విమానానికి ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన విమానం అనే పేరు ఉంది. దీనినే ఫోర్టెస్ ఇన్ ద స్కై అని.. అలాగే ఫ్లైయింగ్ ఓవల్ ఆఫీస్ అని కూడా పిలుస్తుంటారు.
అమెరికా అధ్యక్షుడు ఎక్కడికైనా పర్యటనలపై వెళ్లినప్పుడు ఆయన ప్రయాణించడం కోసం ఈ విమానాన్ని ఉపయోగిస్తారు. ఈ ఎయిర్ ఫోర్స్ విమానానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన సంగతులు ఇలా ఉన్నాయి.
ఎయిర్ పోర్స్ విమానాన్ని బోయింగ్ ఎయిర్ లైన్స్ కంపెనీ రూపొందించింది. అమెరికా అధ్యక్షుడి కార్యాలయంపై ఉండే లోగోనే ఈ విమానంపై కూడా ఉంటుంది. ఆయన ప్రయాణంలో ఉన్నప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో అధికారిక పనులకు అంతరాయం కలగకుండా విమానంలోంచే తమ పనులు చేసుకునే ఆఫీస్ సౌకర్యాలన్నీ ఉంటాయి. అందుకే దీనిని ఫ్లయింగ్ ఓవల్ ఆఫీస్ అని పిలుస్తుంటారు. ఈ ఆఫీసు నుండే అమెరికా అధ్యక్షుడు మీటింగ్స్ లో పాల్గొంటుంటారు.
బోయింగ్ కంపెనీ తయారు చేసిన ఈ విమానాన్ని ఆ కంపెనీనే మెయింటెనెన్స్ బాధ్యతలు చూసుకుంటుంది. అమెరికా ఎయిర్ ఫోర్స్ విభాగానికి చెందిన పైలట్స్ ఈ విమానానికి పైలట్స్‌గా పనిచేస్తారు. శత్రువుల నుండి ఎలాంటి దాడులనైనా తట్టుకునేలా శత్రుదుర్బేధ్యంగా ఈ విమానాన్ని రూపొందించారు. అందుకే దీనిని ఫోర్టెస్ ఇన్ ద స్కై అని పిలుస్తారు. అంతేకాదు.. ఒకవేళ అమెరికాపై శత్రువులు దాడి చేసినా ఈ విమానంలోంచే శత్రువులపై దాడిని ముందుండి నడిపించేలా ఇది ఒక మొబైల్ కమాండ్ సెంటర్‌లా పనిచేస్తుంది. శత్రువులను తిప్పికొట్టే అన్ని ఆధునిక వ్యవస్థలు ఈ విమానం సొంతం.
ఈ విమానంపై బ్లూ కలర్, వైట్ కలర్ కలయికలో గ్రాఫిక్స్ ఉంటాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెడ్ కలర్ లోకి మార్చాలని భావించినప్పటికీ ఆ తరువాత మళ్లీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ విమానంలో మూడు అంతస్తుల్లోనూ 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇదే కాకుండా ప్రత్యేకంగా ఒక మెడికల్ సూట్ కూడా ఉంటుంది. ఈ మెడికల్ సూట్‌లో ఒక డాక్టర్, ఆపరేషన్ థియేటర్, అమెరికా అధ్యక్షుడి రక్తంతో సరిపోయే బ్లడ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి : Food Safety: హోటల్‌లో కల్తీ ఆహారం పెట్టారా..? ఎక్కడ, ఎలా ఫిర్యాదు చేయాలి..?
ఈ విమానంలో ఒకేసారి 100 మందికి ఆహారం వడ్డించేలా సకల సౌకర్యాలు ఉంటాయి. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఉన్న వాళ్లు అప్పుడప్పుడు జర్నలిస్టులు, సీనియర్ అడ్వైజర్స్, సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్స్, గెస్టుల బృందంతో ప్రయాణిస్తుంటారు కనుక విమానంలోనే భోజనం చేయాల్సి వచ్చినా.. వారికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు రెడీగా ఉంటాయి. ఈ విమానంలో 26 మంది క్రూ సిబ్బందితో కలిపి 102 మంది ప్రయాణించే కెపాసిటీ ఉంటుంది.
ఇది కూడా చదవండి : IOCL Recruitment 2023: 490 ఉద్యోగాలు..10వ తరగతి చదివితే చాలు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి