GAIL Recruitment 2024:  గెయిల్‌ ఇండియా 391 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. ఇందులో కెమికల్, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, సివిల్‌ , లేబొరేటరీ, టెలికమ్యూనికేషన్‌, ఫైర్‌, బాయిలర్‌ ఆపరేషన్‌, బిజినెస్‌ అసిస్టెంట్‌, ఫైనాన్స్‌, అకౌంటెంట్‌ విభాగాల్లో భర్తీ చేపట్టింది.ఈ పోస్టులకు సంబంధించి కావాల్సిన అర్హతలు, చివరి తేదీ ఎప్పటి వరకు ఉంటుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే గెయిల్‌ అధికారిక వెబ్‌సైట్‌ అయిన gailonline.com లో దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తుల స్వీకరణ ఈరోజు ఉదయం 11 నుంచి ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 7 చివరి తేదీ. 


గెయిల్‌ ఇండియా 391 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు ఇలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం.
గెయిల్‌ ఇండియా 391 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే విధానం..
గెయిల్‌ అధికారిక వెబ్‌సైట్‌ gailonline.com ఓపెన్‌ చేయాలి.
అందులో కెరీర్‌ సెక్షన్‌ సెలక్ట్‌ చేసుకోవాలి.
ఈ పోర్టల్‌ లో మీ వివరాలను నమోదు చేయాలి.
అక్కడ మీ వివరాలతో లాగిన్‌ అవ్వాలి. మీకు నచ్చిన పోస్టును ఎంపిక చేసుకోవాలి.


ఇదీ చదవండి: ప్రముఖ నిర్మాత, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం!


గెయిల్‌ ఇండియా 391 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల నోటిఫికేషన్..
దరఖాస్తు దారులు క్షుణ్నంగా నోటిఫికేషన్‌ను పరిశీలించిన తర్వాతే దరఖాస్తు చేయాలి. అయితే, గెయిల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు అప్లికేషన్‌ ఫీజు రూ.50 చెల్లించాలి. దీన్ని ఆన్‌లైన్‌లోనే డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. ఫీజు చెల్లించిన తర్వాతే అప్లికేషన్‌ విధానం పూర్తవుతుంది. 


గెయిల్‌ ఇండియా నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు ఫీజు..
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీకి చెందినవారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు దరఖాస్తు చేసుకునే పోస్టులకు అర్హత గల సెర్టిఫికేట్లు మీ వద్ద ఉండాలి.ఇది ప్రూఫ్‌ మాదిరి తీసుకుంటారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయో పరిమితి పోస్టుల ఆధారంగా ఉంటాయి. నోటిఫికేషన్‌ లో దీని గురించిన పూర్తి వివరాలు ఉన్నాయి.


ఇదీ చదవండి:  నాగార్జున సాగర్‌ టూర్‌ ప్యాకేజీ కేవలం రూ.800.. ఇంకా ఎన్నో చూడవచ్చు..!


గెయిల్‌ ఇండియా 391 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల ఎంపిక విధానం..
గెయిల్‌ ఇండియా పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి ముందుగా కంప్యూటర్‌ ఆధారిత టెస్టులను నిర్వహిస్తారు. ఆ తర్వాత నైపుణ్యత లేదా స్కిల్‌ టెస్ట్, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తారు. ఆ తర్వాత అభ్యర్థులను ఎంపిక చేస్తారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter