Tollywood: ప్రముఖ నిర్మాత, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం!

Producer Shyam Prasad Reddy Wife Dead: ప్రముఖ తెలుగు నిర్మాత, మల్లెమాల ఎంటర్‌టైనమెంట్స్‌ అధినేత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి భార్య వరలక్ష్మి (62) తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా ఆమె కేన్సర్‌తో బాధపడుతున్నారు.

Written by - Renuka Godugu | Last Updated : Aug 8, 2024, 09:40 AM IST
Tollywood: ప్రముఖ నిర్మాత, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం!

Producer Shyam Prasad Reddy Wife Dead: ప్రముఖ తెలుగు నిర్మాత, మల్లెమాల ఎంటర్‌టైనమెంట్స్‌ అధినేత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య వరలక్ష్మి (62) కేన్సర్‌తో బాధపడుతూ బుధవారం మరణించారు. విషయం తెలిసిన తెలుగు ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వరలక్ష్మి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి కూతురు.

శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి ప్రస్తుతం 'జబర్దస్త్‌' ప్రముఖ టీవీ ఛానల్‌లో ప్రసారమయ్యే కామెడీ షో కి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షో మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కి మంచిపేరును తీసుకు వచ్చింది. తద్వారా శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి కొత్తనటులను ప్రోత్సహిస్తూ ఎంతో మందికి అవకాశాలు ఇచ్చారు. వీరు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. అంతేకాదు శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి ఢీ, క్యాష్‌, స్టార్‌ మహిళ వంటి షో లకు కూడా ఆయన నిర్మాతగా ఉన్నారు.

ఇక శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు, అంజి, అరుంధతి సినిమాలకు కూడా నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న వరలక్ష్మి బుధవారం తుదిశ్వాస విడిచారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..

శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి ప్రముఖ ఎంఎస్‌ రెడ్డి కుమారుడు. ఈయన కూడా ప్రొడ్యూసర్‌, యాక్టర్‌. ఎన్నో సినిమాలు నిర్మించారు. యాక్ట్‌ కూడా చేశారు. ఈయన నటించిన అన్ని సినిమాల్లో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. తండ్రి బాటలోనే శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి కూడా పట్టాడు. రామోజీరావుతో నిర్మాణ విలువలు నేర్చుకున్నారు. కోదండ రామిరెడ్డి వద్ద డైరక్షన్‌ స్కిల్స్‌ నేర్చుకున్నారు.

మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి కూతురు వరలక్ష్మిని వివాహం చేసుకున్నారు. ఆ సమయంలోనే తలంబ్రాలు సినిమాను చేశారు. 1988 విడుదలైన తలంబ్రాలు రికార్డును బ్రేక్‌ చేసింది. అంతేకాదు హాలివుడ్‌ సినిమాలు చూసి గ్రాఫిక్స్‌ను ఆధారంగా చేసుకుని సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. కోడిరామకృష్ణతో కలిసి అమ్మోరును తీశారు.ఇందులో సౌందర్య, రమ్యకృష్ణ, సురేశ్‌ నటించారు. ఇది కూడా కలెక్షన్స్‌ సునామి సృష్టించింది. అన్ని తరగతుల వారికి ఈ సినిమా నచ్చింది. ఆ తర్వాత చిరంజీవితో కలిసి అంజి సినిమాను తీశారు. అయితే, ఈ సినిమా ఆయనకు భారీ నష్టాలను చూశారు.

ఆ తర్వాత ఆయన గద్వాల సంస్థానం గురించి తెలుసుకున్నారు. స్క్రిప్ట్‌ మార్చి అరుంధతి సినిమా తీశారు. మళ్లీ కోడిరామకృష్ణతో కలిసి అరుంధతి సినిమా తీశారు. ముందుగా మమతా మోహన దాస్‌ను ఎంపిక చేయగా కొన్ని కారణాల వల్ల అనుష్కతో చేశారు. ముందుగా తమిళనటుడు పశుపతిని ఎంపిక చేయగా సోనూసూద్‌తో చేశారు. ఈ పాత్రతో ఆయనకు కూడా మంచి గుర్తింపు లభించింది. ఒకసారి రామోజీరావు టీవీలో కూడా మీ ట్యాలెంట్‌ చూపించవచ్చు కదా అని ఇచ్చిన సలహా మేరకు ఢీ షో ప్రారంభించారు. ఇది బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అయింది. అరుంధతి కూడా హిట్‌ కొట్టింది. ఆ తర్వాత ఎన్నో షో లు ప్రారంభించారు. పెద్ద కూతురు సలహా మేరకు జబర్దస్త్‌ను స్టార్ట్‌ చేశారు.
 

ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News