GAIL Recruitment 2024: గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్‌లో ఉద్యోగాలకు ఇదే మంచి అవకాశం. గెయిల్‌లో మెడికల్ ఆఫీసర్ కొలువుల భర్తీకై రిక్రూట్‌మెంట్ జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ గెయిల్ అధికారిక వెబ్‌సైట్ gailonline.com.లో మొదలైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గెయిల్‌లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవారు 15 రోజుల్లోగా అంటే జూన్ 6 వరకూ అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మెడికల్ ఆఫీసర్ పోస్టులు భర్తీ జరగనుంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తించిన ఎంబీబీఎస్ డిగ్రీ కలిగినవారు గెయిల్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అర్హత ఉంది. దీనికితోడు 1 ఏడాది ఇంటర్న్‌షిప్ చేసుండాలి. గెయిల్‌లో మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసేవాళ్లకు ఎలాంటి ఫీజు అవసరం లేదు. రాత పరీక్ష కూడా లేకుండానే మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. గెయిల్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు జీతం 93 వేల రూపాయలుంటుంది. 


గెయిల్ రిక్రూట్‌మెంట్ 2024 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసినవారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవాళ్లు అప్లికేషన్లను జనరల్ మేనేజర్, గెయిల్ లిమిటెడ్, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, ఉసార్, పోస్ట్ మాల్యన్, రాయగఢ్ జిల్లా, మహారాష్ట్ర చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేసి నింపి పంపించాల్సి ఉంటుంది. 


Also read: LPG Gas Cylinder Price Cut: 69.50 రూపాయలు తగ్గిన గ్యాస్ సిలెండర్ ధర, కొత్త ధరలు ఇలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook