LPG Gas Cylinder Price Cut: ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరలు ప్రతి నెలా ఒకటవతేదీకు మారుతుంటాయి. ఆయిల్ కంపెనీలు సంయుక్తంగా సిలెండర్ ధరల పెంపు లేదా తగ్గుదలపై నిర్ణయం తీసుకుంటుంటాయి. ఇందులో భాగంగానే ఇవాళ జూన్ 1న ఎల్పీజీ డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరలపై సమీక్షించాయి.
డొమెస్టిక్ 14 కిలోల గ్యాస్ సిలెండర్ ధరలు యధావిధిగా కొనసాగనున్నాయి. ఏ మార్పు లేదు. అయితే ఎల్పీజీ 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరల్ని మాత్రం తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఒక్కో గ్యాస్ సిలెండర్ ఏకంగా 69.50 రూపాయలు తగ్గుతోంది. కమర్షియల్ గ్యాస్ సిలెండర్ కొత్త ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి రానున్నాయి. ఇవాళ బుక్ చేసుకున్నవారందరికీ కొత్త ధరలు వర్తించనున్నాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర దాదాపు 70 రూపాయలు తగ్గడంతో కొత్త ధరలు వివిధ నగరాల్లో ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో తగ్గిన ధరల ప్రకారం 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర 1676 రూపాయలుగా ఉంది. అదే ముంబైలో 69.70 రూపాయల తగ్గింపు అనంతరం సిలెండర్ ధర 1629 రూపాయలైంది. ఇక చెన్నైలో తగ్గింపు తరువాత 1841.50 రూపాయలు కాగా కోల్‌కతాలో 1789.50 రూపాయలుంది. కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర 69.50 రూపాయలు తగ్గడం కాస్త ఊరట కల్గించే అంశమే అయినా చాలాకాలంగా డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధర మారకపోవడం గమనార్హం. ఇంతకుముందు మార్చ్ 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరను 19 రూపాయలు తగ్గించాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలు ప్రతి నెలా 1వ తేదీన గ్యాస్ ధరలపై సమీక్ష చేస్తుంటాయి.
ఈసారి 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర తగ్గింపుకు కారణాలు తెలియదు. అంతర్జాతీయ ధరలు, ట్యాక్స్ విధానాలు, డిమాండ్ తదితర కారణాలు కావచ్చు. డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పధకం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గ్యాస్ సిలెండర్‌పై సబ్సిడీ లభిస్తోంది. డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధర తగ్గించకపోవడం కాస్త నిరాశే మిగిల్చింది.
Also read: Pancha Graha Kutami: ఈ మూడు రాశులకు అలర్ట్, జూన్ 5న పంచగ్రహ కూటమి ఉంది జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook