Gandhi and my father had a difficult relationship says Netaji Subhash Chandra Boses daughter Anita Bose Pfaff:  బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఈ మధ్య వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ (Subhash ChandraBose), భగత్‌ సింగ్‌లకు అప్పట్లో మహాత్మా గాంధీ నుంచి మద్దతు లభించలేదంటూ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో నేతాజీ కుమార్తె అనితా బోస్‌ (Anita Bose) స్పందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేతాజీని (Netaji) నియంత్రించలేనని గాంధీ భావించేవారని, అందుకే వారి మధ్య కాస్త ఇబ్బందికరమైన వాతావరణమే ఉండేదని అనితా బోస్‌ పేర్కొన్నారు. అయినప్పటికీ మహాత్మా గాంధీని (Mahatma Gandhi) తన తండ్రి సుభాష్‌ చంద్రబోస్‌ ఎంతగానో ఆరాధించేవారని అనితా బోస్‌ (Anita Bose) స్పష్టం చేశారు. నేతాజీ, మహాత్మా గాంధీ, ఇద్దరూ స్వాతంత్య్రం కోసం పోరాడిన గొప్ప హీరోలే అని ఆమె పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్యం (India independence) అహింస మార్గం ద్వారానే వచ్చిందని సుదీర్ఘకాలం పాటు కొందరు కాంగ్రెస్‌ నేతలు వాదిస్తున్నారని.. స్వాతంత్ర్యానికి నేతాజీ, భారత జాతీయ సైన్యం చర్యలు కూడా దోహదపడ్డాయని అందరికీ తెలుసు అని ఆమె అన్నారు. నేతాజీతో పాటు ఎంతో మందికి మహాత్మా గాంధీ స్ఫూర్తిగా నిలిచారని అనితా బోస్‌ స్పష్టం చేశారు.


Also Read : యూట్యూబ్ లో మరో రికార్డు కొల్లగొట్టిన అల్లు అర్జున్ ‘బుట్టబొమ్మ’ సాంగ్


ఇదిలా ఉంటే నేతాజీని బ్రిటిష్‌ వారికి అప్పగించేందుకు గాంధీ తదితరులు అప్పట్లో అంగీకరించారు అంటూ వచ్చిన ఒక స్టోరీ క్లిప్పింగ్‌ను నటి కంగనా రనౌత్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. స్వాతంత్య్రం కోసం పోరాడే వారిని అణచివేతదారులకు అప్పగించేశారు... ఇలా అప్పగించినవారికి అధికార దాహం, కుయుక్తులే తప్ప ధైర్య సాహసాలు లేవు అంటూ కంగనా రనౌత్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 


అలాగే ఒక చెంప మీద కొడితే రెండోది చూపించాలంటూ మహాత్మాగాంధీ ప్రవచించిన అహింస సూత్రాన్ని కంగనా ఎద్దేవా చేశారు. అలా చేస్తే దక్కేది స్వాతంత్య్రం కాదు.. అది భిక్షే అంటూ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) కామెంట్స్ చేసింది.


Also Read : కోవిడ్ ట్యాబ్లెట్స్‌పై ఫైజర్ కీలక నిర్ణయం, ఇతర కంపెనీలకు అనుమతులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook