యూట్యూబ్ లో మరో రికార్డు కొల్లగొట్టిన అల్లు అర్జున్ ‘బుట్టబొమ్మ’ సాంగ్

Buttabomma Song Records: 'అల వైకుంఠపురములో..' చిత్రంలోని 'బుట్టబొమ్మ' సాంగ్ యూట్యూబ్ రికార్డులను కొల్లగొడుతోంది. ఈ ప్లాట్ ఫామ్ లో 700 మిలియన్ల (60 కోట్ల) పైగా వీక్షణలు సాధించిన తొలి తెలుగు పాటగా ఘనత వహించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2021, 04:14 PM IST
యూట్యూబ్ లో మరో రికార్డు కొల్లగొట్టిన అల్లు అర్జున్ ‘బుట్టబొమ్మ’ సాంగ్

Buttabomma Song Records: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన 'అల వైకుంఠపురములో..' సినిమాలోని 'బుట్టబొమ్మ' సాంగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు అభిమానులున్నారు. అలాంటి ఈ పాట మరో అరుదైన ఘనత అందుకుంది. యూట్యూబ్లో 701 మిలియన్ల (70 కోట్ల) వీక్షణలు సాధించిన తొలి తెలుగు పాటగా రికార్డు నెలకొల్పింది. అలాగే 4.4 మిలియన్ల లైక్స్ లోనూ దూకుకెళ్తోంది. 

అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. తమన్ తన పాటలతో సినిమాపై అంచనాల్ని రెట్టింపు చేశారు. మూవీ విడుదలకు ముందే ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చిందంటే అందుకు కారణం ఈ సినిమా పాటలే. తమన్ సంగీతానికి అర్మాన్ మాలిక్ గాత్రం, అల్లు అర్జున్ స్టెప్పులు 'బుట్టబొమ్మ'కు ప్రాణం పోశాయి. ఈ పాటతో పాటు 'రాములో రాములో' కూడా యూట్యూబ్లో రికార్డు వ్యూస్తో కొనసాగుతోంది. 

Also Read: రాజ్ తరుణ్ ‘అనుభవించు రాజా’ సినిమా ట్రైలర్ వచ్చేసింది

Also Read: Romantic Movie: ఓటీటీలోకి 'రొమాంటిక్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

 

 

Trending News