Sidhu Moose Wala Case: పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసే వాలా హత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈకేసులో అనుమానితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. తానే ప్రతీకార హత్య చేసినట్లు పోలీసులు ముందు ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సిద్ధూ మూసే వాలాను తన ముఠా సభ్యులే కాల్చి చంపారని విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్నటి వరకు తనకు ఈ హత్యకు సంబంధం లేదని బిష్ణోయ్ వాదిస్తూ వస్తున్నాడు. తన అన్న విక్కీ మిద్దుఖేరా హత్యకు ప్రతీకారంగానే ఇది చేసినట్లు పోలీసుల విచారణలో తాజాగా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఐతే సిద్ధూ మూసే వాలా హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఇటీవల బిష్ణోయ్ తెలిపాడు. తీహార్‌ జైల్‌లో తాను ఫోన్‌ కూడా ఉపయోగించలేదన్నాడు. సిద్ధూ మరణ వార్తను తాను టీవీలోనూ చూశానని చెప్పాడు.


గత నెల 29న మాన్సా జిల్లాలో సిద్ధూ వాహనంపై కొందరు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. హత్యకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు సంబంధం ఉందని మొదటి నుంచి పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన తర్వాతి రోజే జైల్‌లో తనకు భద్రత కల్పించాలంటూ పాటియాలా కోర్టును బిష్ణోయ్ ఆశ్రయించడం పలు అనుమానాలు కల్గించింది. ఈక్రమంలోనే సింగర్ హత్య కేసులో కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్టీ బ్రార్ ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు.


అతడు బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీలక సభ్యుడిగా ఉన్నాడు.  బిష్ణోయ్ సోదరుడు మిద్దుఖేరా హత్య కేసులో సిద్ధూ మేనేజర్ షగన్ ప్రీత్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ ఘటన తర్వాత సిద్ధూ మేనేజర్ కనిపించకుండా పోయాడు. ఈ వ్యవహారంలో సిద్ధూ ప్రమేయం ఉందని తెలుస్తోంది. ఈక్రమంలోనే నాలుగురోజులపాటు రిక్కీ నిర్వహించి..సింగర్‌ను హత మార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు సింగర్ సిద్ధూ కుటుంబాన్ని పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామన్నారు.


Also read: China Earthquake: చైనాలో భారీ భూకంపం..పరుగులు తీసిన జనాలు..వీడియోలు వైరల్..!


Also read:ఆ ప్లేయర్ భారత జట్టుకు భారమయ్యాడా?.. రిటైర్మెంట్ ఇవ్వక తప్పదా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook