China Earthquake: చైనాలో భారీ భూకంపం..పరుగులు తీసిన జనాలు..వీడియోలు వైరల్..!

China Earthquake: కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చైనాను భారీ భూకంపం వణికించింది.

Written by - Alla Swamy | Last Updated : Jun 3, 2022, 05:35 PM IST
  • చైనాలో భారీ భూకంపం
  • నలుగురు మృతి, పలువురికి గాయాలు
  • వైరల్‌గా మారిన దృశ్యాలు
China Earthquake: చైనాలో భారీ భూకంపం..పరుగులు తీసిన జనాలు..వీడియోలు వైరల్..!

China Earthquake: కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చైనాను భారీ భూకంపం వణికించింది. భూకంపంలో నలుగురు మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని అక్కడి అధికారులు వెల్లడించారు. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.1గా నమోదైంది. సాయంత్రం 5 గంటలకు యాన్‌ నగరంలోని లుషాన్ కౌంటీలో భూకంపం సంభవించింది. దీనిని చైనా భూకంప నెట్‌వర్క్‌ల కేంద్రం(CENC) వివరించింది.

భూకంప కేంద్రం 17 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైందని పేర్కొంది. భూకంపం సంభవించిన మూడు నిమిషాల తర్వాత యాన్‌లోని బాక్సింగ్ కౌంటీలో 4.5 తీవ్రతతో మళ్లీ భూమి కంపించినట్లు తెలుస్తోంది. భూకంపం సంభవించిన సమయంలో చోటు చేసుకున్న ఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భూకంపం సమయంలో రోడ్లపై జనాలు పరుగులు తీశారు. వాహనాలను సైతం అక్కడ వదిలి ప్రాణ భయంతో వణికిపోయారు.

ఈదృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ దృశ్యాలన్నీ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇళ్లు, షాపింగ్ మాళ్లలో భయానక వాతావరణం కనిపించింది. స్కూళ్లల్లో చిన్నారులు సైతం పరుగో పరుగు పెట్టారు. భూకంపం ధాటికి ఇళ్లు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. రెండు కౌంటీల్లో టెలికమ్యూనికే షన్‌ దెబ్బతింది. ఐతే అత్యవసర మరమ్మతుల తర్వాత ఆప్టికల్ కేబుళ్లను పునరుద్ధరించారు.

 

 

భారీ భూకంపంతో చైనా ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సహాయకచర్యలను ముమ్మరం చేసింది. భూకంప నష్టాన్ని అంచనా వేస్తోంది. ఎమర్జెన్సీ, రెస్క్యూ, ఇతర విభాగాలతో కలిపి మొత్తం 4 వేల 500 మంది సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారికి బయటకు తీసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

Also read: Palmistry: మీ చేతి రేఖలపై ఆ వృత్తం ఉందా..అయితే అంతులేని సంపదే మీకు

Also read:Subramanian Swamy: అమిత్‌ షాకు హోం కాదు..క్రీడా శాఖ ఇవ్వాలి..సుబ్రహ్మణ్య స్వామి సెటైర్లు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

 

 

 

 

 

Trending News