లక్నో: గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే పోలీసుల ఎన్‌కౌంటర్ (Vikas Dubey Encounter)‌లో హతమయ్యాడు. 8 మంది పోలీసులను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు అయిన వికాస్ దుబేను మధ్యప్రదేశ్ నుంచి యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కాన్పూర్‌కు వాహనంలో తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో నగరానికి చేరుకుంటుండగా బర్రా ఏరియాలో పోలీసుల వాహనం ఒకటి అదుపు తప్పి ప్రమాదానికి లోనైంది. ఇదే అదనుగా భావించిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. Vikas Dubey Arrested: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దుబే అరెస్ట్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ వికాస్ దుబేను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా వికాస్ దుబే మరణించాడని (Vikas Dubey Dead) యూపీ పోలీసులు నిర్ధారించారు. నాటకీయ పరిణామాల నడుమ వికాస్ దుబేపై పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. వికాస్ దుబే అరెస్ట్‌పై తల్లి సరళా దేవి ఏమన్నారంటే!


జులై 8న (గురువారం) ఉదయం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహంకాళీ ఆలయానికి దర్శనానికి రాగా, గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మధ్యప్రదేశ్ పోలీసులు వికాస్ దుబేను కాన్పూర్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీమ్‌కు అప్పగించారు. నిన్న రాత్రి రోడ్డు మార్గం ద్వారా గ్యాంగ్‌స్టర్‌ను కాన్పూర్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం ఓ వాహనం బోల్తాపడ్డ సమయంలో తప్పించుకునేందుకు యత్నించిన వికాస్ దుబేపై పోలీసులు కాల్పులు (Vikas Dubey Encounter) జరిపారు. కొద్దిసేపటికే వికాస్ దుబే మరణించాడు   జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos