వికాస్ దుబే అరెస్ట్‌పై తల్లి సరళా దేవి ఏమన్నారంటే!

గత వారం రోజులుగా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే‌ (Vikas Dubey) ఎట్టకేలకు అరెస్టయ్యాడు. నేటి ఉదయం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహంకాళీ ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన వికాస్ దుబేను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే.

Written by - Shankar Dukanam | Last Updated : Jul 9, 2020, 01:39 PM IST
వికాస్ దుబే అరెస్ట్‌పై తల్లి సరళా దేవి ఏమన్నారంటే!

లక్నో: గత వారం రోజులుగా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే‌ (Vikas Dubey) ఎట్టకేలకు అరెస్టయ్యాడు. నేటి ఉదయం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహంకాళీ ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన వికాస్ దుబేను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. కుమారుడు వికాస్ దుబే అరెస్ట్‌ (Vikas Dubey Arrest) పై తల్లి సరళా దేవి స్పందించారు. నా కుమారుడు వికాస్ దుబే అత్తామామలు మధ్యప్రదేశ్‌లో ఉంటారని ఆమె తెలిపారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దుబే అరెస్ట్

దీంతో వికాస్ ఉజ్జయినీకి వెళ్లి ప్రతి ఏడాది మహంకాళీ ఆలయాన్ని దర్శించుకుంటాడు. ఈ క్రమంలో నేడు ఆలయానికి వెళ్లి ఉంటాడన్నారు. అయితే వికాస్ దుబే విషయంలో ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో అదే చేస్తుందన్నారు. ఈ విషయంలో నేను ప్రత్యేకంగా ఏం చెప్పదలుచుకోలేదన్నారు. ప్రస్తుతం ఆమె చిన్న కుమారుడి వద్ద లక్నోలో ఉంటున్నారు. అప్సరా రాణిగా పేరు మార్చి RGV థ్రిల్లర్ ఛాన్స్!

కాగా, ఇటీవల కాన్పూర్‌లోని బిక్రూ గ్రామంలో అరెస్ట్ చేసేందుకు వస్తున్నారన్న సమాచారం అందుకున్న వికాస్ దుబే తన అనుచరులతో కలిసి ప్లాన్ ప్రకారం కాల్పులు జరపడంతో 8 మంది పోలీసులు చనిపోయారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడిన సరళా దేవి.. తన కుమారుడు చేసింది తప్పు అని, అతడిపై ఏ చర్యలు తీసుకున్నా తమకు అభ్యంతర లేదని చెప్పడం తెలిసిందే.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos

Trending News