GHMC Election 2020 Results: హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ( GHMC Elections 2020 ) ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్‌ను నిలువరించిన రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి అగ్ర నాయకత్వం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక విజయోత్సాహంతో గ్రేటర్ బరిలోకి దిగిన బీజేపీ ( BJP ) 48 డివిజన్లలో కాషాయ జెండాను (GHMC Election Results) ఎగుర వేసి బలమైన పార్టీగా అవతరించింది. 2016 ఎన్నికల్లో కేవలం 4 స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈ ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో గ్రేటర్ బరిలోకి దిగింది. ఈ ఎన్నికల్లో మేయర్ పీఠం దక్కించుకోకున్న.. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనంటూ బీజేపీ ముందుకు దూసుకెళ్తోంది. దీంతో రాష్ట్రంలోని ఆ పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. Also read : GHMC Election results 2020: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై బీజేపి స్పందన..



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రేటర్‌లో 48డివిజన్లల్లో బీజేపీ గెలిచిన నేపథ్యంలో ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ( Amit Shah ) ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారని రాష్ట్ర నేతలను కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారధ్యంలో, అభివృద్ధి లక్ష్యంగా సాగిస్తున్న బిజెపి రాజకీయాలపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అమిత్‌ షా పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ( GHMC ) ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (J. P. Nadda), రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay Kumar) కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వారితోపాటు బీజేపీ కార్యకర్తలను కూడా ఆయన అభినందించారు.  Also read : MP Arvind Dharmapuri: తెలంగాణలో బీజేపికి 15 లోక్ సభ సీట్లు


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook