Goa Chief Minister tested Covid-19: న్యూఢిల్లీ: కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, అగ్రనేతలు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలనే పలువురు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌  ( Pramod Sawant ) కి కూడా కరోనా సోకింది. ఈ మేరకు బుధవారం ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిందని, లక్షణాలు లేని కారణంగా తాను హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇంటినుంచే తన విధులను నిర్వర్తిస్తానని వెల్లడించారు. తనను కలిసిన వారు.. సన్నిహితంగా ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఆయన ట్విట్ చేశారు. Also read: Parliament session: ప్ర‌శ్నోత్త‌రాలు లేకుండానే పార్ల‌మెంట్‌



ఇదిలాఉంటే.. ఇటీవల కాలంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, త్రిపుర సీఎం విప్లవ్ కుమార్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. Also read: Pawan Kalyan: వారి మరణం మాటలకు అందని విషాదం