భగభగమంటున్న బంగారం ధరలు
రోజురోజుకు పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. మార్కెట్‌లో బంగారం ధర గరిష్టస్థాయికి చేరుకుంది. సోమవారం 10 గ్రాములకు రూ. 918 పెరుగుదలతో బంగారం ధర రూ. 41 వేలకు చేరింది. బంగారం ధర శుక్రవారం ఏకంగా రూ. 850 పెరిగిన సంగతి తెలిసిందే. ఈ రెండు రోజుల్లోనే బంగారం ధర రూ. 1800 పెరిగింది. అంతర్జాతీయ అనిశ్చితికి తోడు అమెరికా - ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో బంగారం ధరలపై పడిందని బిజినెస్ నిపుణులు అంటున్నారు.
ఢిల్లీ : రోజురోజుకు పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. మార్కెట్‌లో బంగారం ధర గరిష్టస్థాయికి చేరుకుంది. సోమవారం 10 గ్రాములకు రూ. 918 పెరుగుదలతో బంగారం ధర రూ. 41 వేలకు చేరింది. బంగారం ధర శుక్రవారం ఏకంగా రూ. 850 పెరిగిన సంగతి తెలిసిందే. ఈ రెండు రోజుల్లోనే బంగారం ధర రూ. 1800 పెరిగింది. అంతర్జాతీయ అనిశ్చితికి తోడు అమెరికా - ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో బంగారం ధరలపై పడిందని బిజినెస్ నిపుణులు అంటున్నారు. దీంతో శుక్రవారం నుంచి నేటి వరకు మార్కెట్‌లో బంగారం ధర పరుగులు పెడుతుంది. మార్కెట్‌లో బంగారం ధర పెరగడానికి రూపాయి కూడా దోహదపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి సోమవారం 72 మార్క్ కిందకు పతనమైంది. ఇది కూడా బంగారం ధర పెరగడానికి ఒక కారణమని అంటున్నారు.
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 390 పెరగడంతో.. దాని ధర రూ. 38,320కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ. 390 పెరగడంతో.. దాని ధర రూ. 41,770కి చేరింది. కిలో వెండి ధర రూ. 200 పెరుగుదలతో.. రూ. 49,600కు చేరింది. బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..