ఫారిన్ మార్కెట్ ప్రభావం ఇండియన్ మార్కెట్ పై కూడా పడింది. ముఖ్యంగా గత వారం రోజులుగా దేశీయ మార్కెట్‌లో కొనుగోళ్ళ శాతం తగ్గడంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం (తులం) ధర అమాంతం తగ్గి ప్రస్తుత రేటు రూ.31,450గా నమోదైంది. హైదరాబాద్‌లో ఇదే ధర రూ.31,555గా రికార్డైంది. చెన్నైలో మాత్రం రూ.31,590గా రికార్డైంది. కేరళలో ఇదే ధర రూ.30267గా రికార్డవ్వడం విశేషం. అదే 22 క్యారెట్ల బంగారం మాత్రం తులం రూ.29,150గా చెన్నై మార్కెట్లో రికార్డైంది. హైదరాబాద్‌లో కూడా ఇదే రేటు కొనసాగుతోంది.  అయితే ఇదే బంగారం ధర ఢిల్లీ మార్కెట్‌లో రూ.29,800 ఉండడం గమనార్హం. అత్యధికంగా ఇదే ధర కోలకతాలో రూ.30,060గా నమోదైంది. అదే గతంలో ఇదే ధర 32,350 నుండి 31,720 వరకు ఉండేది. అలాగే వెండి ధరలు కూడా తగ్గాయి. ప్రస్తుత ధర రూ.39,500 రూపాయలుగా రికార్డు అయ్యింది.