బంగారం అక్రమ రవాణాదారులు తెలివి మీరిపోతున్నారు. ఎలాగైనా కస్టమ్స్ కళ్లు గప్పి బంగారం తీసుకురావాలని .. తెలివికి పదును పెట్టి మరీ. .  బంగారాన్ని దుబాయ్, సౌదీ అరేబియా లాంటి దేశాల నుంచి ఇండియాకు బంగారాన్ని తీసుకు వస్తున్నారు. కానీ వాళ్ల దురదృష్టమో, కస్టమ్స్ వాళ్ల అదృష్టమో కానీ.. ఎయిర్ పోర్టుల్లోనే పట్టుబడుతున్నారు. 


తాజాగా ఓ వ్యక్తి సౌదీ అరేబియా.. రాజధాని రియాద్ నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగాడు. వస్తూ  వస్తూ. .  232 గ్రాముల బంగారం తీసుకొచ్చాడు. ఐతే నేరుగా తీసుకొస్తే.. కస్టమ్స్ అధికారులకు దొరికేస్తామని అతనికీ తెలుసు.  అందుకే తెలివి ప్రదర్శించాడు. తలుపులకు వేసే లాకర్లలో పార్టులుగా బంగారాన్ని తయారు చేసి అందులో తీసుకొచ్చాడు. కానీ కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పడం అంత తేలిక కాదు కదా..! స్మగ్లర్లకే అంత తెలివి ఉంటే కస్టమ్స్ అధికారులకు ఎంత తెలివి ఉండాలి..?  అతన్ని ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. వారు స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 9 లక్షల 14 వేలు విలువ చేస్తుంది. 
 [[{"fid":"182942","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
మరో విషయం ఏంటంటే..గతంలోనూ ఈ వ్యక్తి పలుమార్లు దుబాయ్, సౌదీ అరేబియా నుంచి ఇలాగే బంగారం అక్రమ రవాణా చేశాడు. ఇప్పటి వరకు ఐదుసార్లు గోల్డ్ స్మగ్లింగ్ చేసినట్లు కస్టమ్స్ అధికారుల ఎదుట ఒప్పుకున్నాడు. తాను ఇప్పటి వరకు 1160 గ్రాముల బంగారం ఇండియాకు తీసుకొచ్చానని చెప్పడం కొసమెరుపు..!! జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..