Central Government Employees Retirement Age: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. మొదటి డీఏ నాలుగు శాతం పెరగ్గా.. రెండో డీఏ ఎంత పెరుగుతోందనని ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం 42 శాతం డీఏను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్నారు. రెండో డీఏ కూడా 4 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ వయస్సులో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ప్రభుత్వ రంగ బ్యాంకుల అధినేతలు, ఎండీల పదవీ విరమణ వయస్సును పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే కింది స్థాయి ఉద్యోగుల విషయంలో మార్పులు లేనట్లు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ దినేష్ ఖరా పదవి పొడగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు), ఎల్‌ఐసీ ఛైర్మన్ల పదవీ విరమణ వయస్సును పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని అంటున్నారు. సీఎస్‌బీ మేనేజింగ్ డైరెక్టర్ల పదవీ విరమణ వయస్సు ప్రస్తుత 60 సంవత్సరాల ఉంది. దీనిని 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ముందు ఉంది. 


సీనియర్ బ్యాంక్ అధికారి ఖరా 2020 అక్టోబర్‌లో ఎస్‌బీఐ చైర్మన్ పదవిని స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ పదవిలో ఆయన  మూడేళ్లపాటు కొనసాగుతారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆయన పదవి కాలం ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలోనే పదవీ కాలం పొడగించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎస్‌బీఐ చైర్మన్‌ 63 ఏళ్ల వరకు పదవిలో ఉండొచ్చు. వచ్చే ఏడాది ఆగస్టులో ఖరాకు 63 ఏళ్లు నిండుతాయి. 


ప్రస్తుతం ఈ విషయంపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పీఎస్‌బీలు, ఎల్‌ఐసీ చీఫ్‌ల పదవీ విరమణ వయస్సును పెంచేందుకు చర్చలు జరుపుతున్నట్లు ఓ అధికారి తెలిపారు. దీంతో పాటు పీఎస్‌బీ ఎండీల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచే అంశంపై కూడా చర్చ జరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం ఎల్‌ఐసీ చైర్మన్ పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలుగా ఉందని తెలిపారు.


Also Read: West Bengal Fire Accident: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది దుర్మరణం  


Also Read: Pakistan ODI Rank: వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్‌ టీమ్‌గా పాకిస్థాన్.. భారత్ ర్యాంక్ ఎంతంటే..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook