Millet Cultivation: జమ్మూ కాశ్మీర్ రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 8 వేల హెక్టార్ల భూమిలో సాంప్రదాయ మిల్లెట్ పంటల సాగును పునరుద్ధరించేందుకు రెడీ అవుతోంది. మొత్తం 10 జిల్లాల్లోని అన్నదాతలకు 100 శాతం సబ్సిడీతో 7 రకాల ముతక తృణధాన్యాల విత్తనాలను అందించనుంది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే చిరు ధాన్యాల ఉత్పత్తి.. వినియోగాన్ని పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.15 కోట్లు కూడా కేటాయించింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 10 నుంచి 20 క్వింటాళ్ల వరకు ఉత్పాదకతను పెంచేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ప్రాజెక్ట్ కింద మూడేళ్లు చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించడమే లక్ష్యని వ్యవసాయోత్పత్తి శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి వెల్లడించారు. చిరు ధాన్యాల వినియోగం పెంచడంతోపాటు రైతులకు వ్యవస్థాపక అవకాశాలను కల్పించడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రాజెక్టులో భాగంగా 1,400 హెక్టార్లలో మినుములు సాగు చేసేందుకు వ్యవసాయ శాఖ కేటాయించగా.. 100 శాతం సబ్సిడీతో రైతులకు విత్తనాలు అందజేస్తున్నట్లు తెలిపారు.


జమ్మూ డివిజన్‌లోని 10 జిల్లాల్లో 1,400 హెక్టార్ల విస్తీర్ణంలో చిరు ధాన్యాల ఉత్పత్తికి కేటాయించిందనట్లు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎఎస్ రీన్ చెప్పారు. తమ దగ్గర 7 రకాల మిల్లెట్లు ఉన్నాయని.. 100 శాతం సబ్సిడీపై రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. అన్నదాతలు మినీ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ను ప్రారంభించాలనుకుంటే.. ప్రభుత్వం రూ.4 నుంచి 5.25 లక్షల వరకు సబ్సిడీ ఇస్తోందన్నారు. 


Also Read: User Charges Hike: సైలెంట్‌గా షాకిచ్చిన ప్రభుత్వం.. భారీగా ధరలు పెంపు  


అదేవిధంగా చిరు ధాన్యాలతో ఫుడ్ తయారు చేసే రెస్టారెంట్లను ప్రోత్సహిస్తున్నామని ఆయన అన్నారు. ముతక ధాన్యంతో కూడిన ఆహారాన్ని ప్రవేశపెట్టేందుకు వారికి రూ.2 లక్షల సబ్సిడీని అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. వాతావరణ మార్పులను తట్టుకోవడం వల్ల మిల్లెట్‌లను భవిష్యత్‌ పంటలుగా ఆయన అభివర్ణించారు. చిరు ధాన్యాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం విత్తనాలపై పూర్తిగా సబ్సిడీ ఇవ్వడంపై ఆ రాష్ట్ర రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనేకమంది అన్నదాతలు చిరు ధాన్యాలను సాగు చేసేందుకు ముందుకు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.


Also Read: Bandi Sanjay Slams CM KCR: సీఎం కేసీఆర్ ఫాంహౌజ్‌లో నిమ్మకాయలు.. నన్ను బలిస్తారేమో అనుకున్నా: బండి సంజయ్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook