Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు ఓ శుభవార్త. అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేకంగా బుకింగ్ పాయింట్ ప్రారంభం కానుంది.కేరళ ప్రభుత్వంతో చర్చలు జరిగాయని..ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్బంగా భక్తుకు గుడ్‌న్యూస్ విన్పిస్తామని శబరిమల ఆలయ కమిటీ చెబుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కోవిడ్ ( Covid19 virus ) కారణంగా చాలాకాలంగా శబరిమల ఆలయం ( Sabarimala temple ) మూతపడింది. తరువాత అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా తెర్చినప్పటికీ..ఆంక్షల మధ్య దర్శనాలు జరుగుతున్నాయి. పరిమిత సంఖ్యలోనే భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. కోవిడ్ నియమాలు కఠినంగా ఉండటంతో అధిక సంఖ్యలో భక్తులు సొంత రాష్ట్రాల్లోని అయ్యప్ప ( Ayyappa ) ఆలయాల్లోనే దీక్ష విరమిస్తున్నారు. ఈ నేపధ్యంలో కేరళ ప్రభుత్వంతో అయ్యప్పస్వామి ఆలయ కమిటీ చర్చించింది. 


ప్రస్తుతం శబరిమలలో రోజుకు వేయి మందికి మాత్రమే భక్తులకు అవకాశమిస్తున్నారు. వారాంతంలో మాత్రం రెండు వేల మందికి అవకాశం లభిస్తోంది. స్వామి దర్శనానికి ప్రతి రోజూ 5 వేలమందికైనా అనుమతివ్వాలని కేరళ ప్రభుత్వానికి ( Kerala Government ) ఆలయ కమిటీ పదే పదే విజ్ఞప్తులు చేస్తోంది. ప్రభుత్వం అనుమతిచ్చే పరిస్థితులున్నాయని..ఇవాళ అంటే నవంబర్ 30 న కార్తీక పౌర్ణమి సందర్బంగా భక్తులకు గుడ్‌న్యూస్ అందిస్తామని స్వయంగా ఆలయ కమిటీనే చెబుతోంది. ఇందుకు అనుగుణంగా శబరిమలలో భక్తుల కోసం బుకింక్ పాయింట్ ప్రారంభించనున్నారు. అయితే భక్తులు కచ్చితంగా కోవిడ్ నిబంధనల్ని పాటించాల్సిందేనని కమిటీ సూచించింది. కోవిడ్ నిమయాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కమిటీ హెచ్చరించింది. Also read: First Love Jihad Case: దేశంలో తొలి లవ్ జిహాద్ కేసు నమోదు