Odisha Train Accident: రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చిన గూడ్స్ రైలు.. ముగ్గురు మృతి
Goods Train Crashes Into Passengers Waiting Hall: ఒడిశాలో గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. కొరాయి స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు.
Goods Train Crashes Into Passengers Waiting Hall: ఒడిశాలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. జాజ్‌పూర్ జిల్లాలోని కొరాయి స్టేషన్ వద్ద సోమవారం తెల్లవారుజామున గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ప్లాట్‌ఫారమ్‌పైన ప్రయాణికుల నిరీక్షణ గదిలోకి గూడ్స్ రైలు దూసుకువచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా రెండు రైలు మార్గాలు నిలిచిపోయాయని రైల్వే అధికారులు తెలిపారు. స్టేషన్ భవనం కూడా దెబ్బతింది. సహాయక బృందాలు, రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. గూడ్స్ రైలు ప్లాట్‌ఫామ్‌కు ఒక్కసారిగా రావడంతో ప్రయాణికులు పరుగులు పెట్టారు.
ఈ ప్రమాదంలో పది బోగీలు బోల్తా పడ్డాయి. పలువురు ప్రయాణికులు బోగీల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని జాజ్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో చేర్పించారు. డీఆర్ఎం ఖోర్ధా రోడ్‌తో పాటు ఇతర శాఖ అధికారులు కూడా ప్రమాద స్థలానికి చేరుకుని రెస్క్యూ, పునరుద్ధరణ పనులను చేపట్టారు.
ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు రైళ్ల కోసం ప్లాట్‌ఫారమ్ వద్ద వెయిటింగ్ హాల్‌లో వేచి ఉన్నారు. ఈ సమయంలో అనుకోకుండా గూడ్స్ రైలు ఒక్కసారిగా దూసుకురావడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మూడు నాలుగు వ్యాగన్లు ఫుట్ ఓవర్ బ్రిడ్జికి ఢీకొని ఆగిపోయాయి.
రెస్క్యూ ఆపరేషన్ గురించి మాజీ అగ్నిమాపక అధికారి సుకాంత్ సతీ మాట్లాడుతూ.."కొరెయి స్టేషన్‌లో జరిగిన రైలు ప్రమాదం ఇంతకు ముందు చూడలేదు. గూడ్స్ రైలు వ్యాగన్లు ప్లాట్‌ఫారమ్‌పైకి దూసుకువచ్చి వెయిటింగ్ హాల్‌ను ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో హాల్ గోడలు కూలిపోయాయి. స్టేషన్ భవనం కూడా దెబ్బతింది. ప్లాట్‌ఫారమ్, శిథిలాల మీద చెల్లాచెదురుగా పడి ఉన్న గూడ్స్ వ్యాగన్‌లను తొలగించడానికి క్రేన్లు, ప్లాస్మా కట్టర్లు వంటి భారీ యంత్రాలు అవసరం. దీనికి సమయం పడుతుంది.." అని ఆయన తెలిపారు.
ప్రమాదానికి గల కారణం గురించి అప్పుడే చెప్పడం చాలా తొందర అవుతుందని మరో అధికారి నిరాకర్ దాస్ అన్నారు . 'ఒక గూడ్స్ రైలు స్టేషన్ దాటేటప్పుడు దాని వేగాన్ని తగ్గించాలి. ప్రమాదం జరిగినప్పుడు రైలు చాలా వేగంతో కదిలి ఉండవచ్చు. మా విచారణ బృందం రైలు చాలా వేగంతో కదిలిందో లేదో విచారణ జరుపుతుంది. మొత్తం 54 బోగీలు ఉన్నాయి. ఎనిమిది బోగీలు ప్లాట్‌ఫారమ్‌పైకి దూకువచ్చాయి..' అని ఆయన చెప్పారు.
Also Read: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే గొప్ప బ్యాట్స్‌మెన్ కాదు.. టిమ్ సౌథీ షాకింగ్ కామెంట్స్
Also Read: Shraddha Murder Case: శ్రద్ధా హత్య కేసులో సరికొత్త కోణం.. విచారణలో పోలీసులకే షాక్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook