Tagore Government college: అది పేరుకే కాలేజీ, లోపల చూస్తే మినీ ఫారెస్టే..!
Tagore Government college: పచ్చదనం- పర్యావరణానికి ఆ కాలేజీ కేరాఫ్ అడ్రస్. ఆ కాలేజీ ప్రిన్సిపల్ చొరవతో 15 ఎకరాల స్థలంలో అర్బన్ ఫారెస్టే ఏర్పాటైంది. పక్షులు, గబ్బిలాలు, బాతులకు ఆవాసంగా మారింది పుదుచ్చేరిలోని ఠాగూర్ ప్రభుత్వ కళాశాల.
Tagore Government college: ఎక్కడైనా ఓ పదిహేను ఎకరాల స్థలం కనిపిస్తే ఏం చేస్తారు. ఓ పెద్ద షాపింగ్ క్లాంపెక్స్ నిర్మిస్తారు. అదే ఆ స్థలం ఓ ప్రభుత్వ కాలేజీ ఆవరణలో ఉంటే.. ఏం చేస్తారు. మహాఅయితే మరో కొత్త బ్లాకో.. లేక ఆడుకునేందుకు గ్రౌండో నిర్మిస్తారు. కానీ ఆ కాలేజీ ప్రిన్సిపల్ మాత్రం పచ్చదనం- పర్యావరణానికి పెద్దపీట వేశారు. అందులో భాగంగా సరికొత్త అర్బన్ ఫారెస్ట్ ను నిర్మించారు. ఆ కళాశాల పేరే ఠాగూర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ. పుదుచ్చేరిలోని ప్రముఖ కాలేజీల్లో ఇదీ ఒకటి. 1961లో ఈ కాలేజీ ఏర్పాటైంది. ఆర్ట్స్‌తో పాటు కామర్స్, సైన్స్ విభాగాల్లో పలు కోర్సులు ఆఫర్ చేస్తోంది.
ఈ కాలేజీలో విద్యాబుద్ధులే కాదు.. పర్యావరణం దాని ప్రాముఖ్యతను కూడా పాఠాలుగా బోధిస్తారు. ఆ కాలేజీ ప్రిన్సిపల్ శశికాంతదాస్ కు పర్యావరణంపై ప్రేమ ఎక్కువ. కాలేజీ ఆవరణలో విరివిగా మొక్కలు నాటాలని సంకల్పించారు. అందులోభాగంగా ఎందుకుపనికిరాకుండా పోయిన 15 ఎకరాల బంజరు భూమిని గుర్తించి చదును చేశారు. చుట్టూ గోడలపై ఉన్న పోస్టర్లను చింపేశారు. అందులోని 8 ఎకరాల్లో కేవలం అరటి, పామాయిల్, కొబ్బరి, సపోటా, పనాస మొక్కలను నాటారు. మిగతా ఎకరాల్లో పలు రకాల ఇతర మొక్కలను నాటారు. గత ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఈ 15 ఎకరాల స్థలంలో మొత్తంగా 5 వేల మొక్కలను నాటినట్టు కాలేజీ ప్రిన్సిపల్ శశికాంతదాస్ చెప్పారు.
15 ఎకరాల్లో పూర్తిస్థాయిలో నాటిన చెట్లు పక్షులకు ఆవాసంగా మారాయి. 20 రకాల పక్షులు, 35 రకాల గబ్బిలాలు ఈ అర్బన్ ఫారెస్ట్ లో మనకు కనిపిస్తాయి. బాతుల కోసం సపరేట్ గా ఓ కొలను నిర్మించారు. ఇక పావురాలు కూడా పెద్దసంఖ్యలో వస్తు పోతుంటాయి. గ్రీనరీ పెరుగుతుండటంతో పక్షులు భారీగా తరలివచ్చి ఆవాసం ఏర్పరుచుకుంటున్నాయి. అంతేకాకుండా వర్షపు నీటిని స్టోరేజ్ చేసేందుకు కూడా చర్యలు చేపట్టారు. 25 లక్షల లీటర్ల నీటిని ఒడిసిపడుతున్నారు. కాలేజీ ఆవరణలో కూరగాయలను సైతం సాగు చేస్తున్నారు. ఆ కూరగాయలతోనే క్యాంటీన్ లో పలురకాల వంటకాలు తయారు చేస్తారు. సహజసిద్ధంగా సాగు అయిన కూరగాయల భోజనం విద్యార్థులకు అందిస్తారు. మొత్తంగా కాలేజీ ప్రిన్సిపల్ శశికాంతదాస్ తీసుకున్న ఓ ఆలోచన ఎన్నో మూగజీవాలకు స్థిర ఆవాసాన్ని ఏర్పరిచినట్టైంది. పచ్చదనం- పర్యావరణపై ప్రేమ ఉన్న శశికాంతదాస్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు పర్యావరణవేత్తలు.
Also Read: CM Jagan review on Health: ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చండి..వైద్యారోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష..!
Also Read: ఇంతకాలం ఏ లక్ష్యంతో ఆడానో దాన్ని అందుకోలేకపోయా.. చాలా భాధగా ఉంది: మిథాలీ రాజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.