కరోనా లక్షణాలతో ప్రభుత్వాస్పత్రికి వెళ్తే.. పారాసిటమోల్ ఇచ్చారు
కరోనా వైరస్ లక్షణాలున్న తనకు కోవిడ్ టెస్ట్ చేయండని ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన తన సోదరుడికి పారాసిటమోల్ టాబ్లెట్స్ చేతిలో పెట్టి పంపించారని ఓ యువకుడు శనివారం మీడియా ఎదుట వాపోయాడు. అంతేకాకుండా ఇదే విషయమై ఫిర్యాదు చేద్దామని హెల్ప్ లైన్ నెంబర్స్‌కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అక్కడి నుండి స్పందనే కనిపించలేదంటున్నాడు బాధిత యువకుడి సోదరుడు.
నొయిడా: కరోనా వైరస్ లక్షణాలున్న తనకు కోవిడ్ టెస్ట్ చేయండని ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన తన సోదరుడికి పారాసిటమోల్ టాబ్లెట్స్ చేతిలో పెట్టి పంపించారని ఓ యువకుడు శనివారం మీడియా ఎదుట వాపోయాడు. అంతేకాకుండా ఇదే విషయమై ఫిర్యాదు చేద్దామని హెల్ప్ లైన్ నెంబర్స్‌కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అక్కడి నుండి స్పందనే కనిపించలేదంటున్నాడు బాధిత యువకుడి సోదరుడు. కరోనా భూతం జడలు విప్పుకున్న ఉత్తర్ ప్రదేశ్‌లోని గౌతంబుద్ధ్ నగర్ జిల్లా పరిధిలోని నొయిడాలోనే ఈ ఘటన వెలుగుచూడటం మరింత సంచలనం సృష్టించింది. అంతేకాకుండా అసలు ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంపైనా జనంలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యేలా చేసింది.
Read also : కరోనావైరస్‌ను ఓడించిన 93 ఏళ్ల వృద్ధ దంపతులు
బాధిత యువకుడి సోదరుడు వెల్లడించిన వివరాల ప్రకారం.. నొయిడాలోని 30వ సెక్టార్‌కి చెందిన 27 ఏళ్ల యువకుడు అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు.. అతడిని కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు. ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు నొయిడాలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా.. అక్కడ వారు తన సోదరుడి మాట వినిపించుకోకుండా పారాసిటమోల్ టాబ్లెట్స్ ఇచ్చి పంపించారని యువకుడు తెలిపాడు.
Read also : హమ్మయ్య.. ఆ సింగర్‌కి ఆరోసారికి కరోనా నెగటివ్ ఫలితం
ఈ ఘటన అనంతరం గత నాలుగైదు రోజులుగా హెల్ప్ లైన్ నెంబర్స్‌కి, గౌతం బుద్ధ్ నగర్ జిల్లా మెజిస్ట్రేట్, జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా, మెస్సెజెస్ ఇచ్చినా ఫలితం లేకపోయిందన్నాడు రోగి సోదరుడు. చివరకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తెలిసిన వారి ద్వారా ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని రోగి సోదరుడు వాపోయాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..