ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనిక కపూర్‌కి ఎట్టకేలకు ఆరోసారి చేసిన కరోనా పరీక్షల్లో నెగటివ్ వచ్చింది. విదేశాలకు వెళ్లొచ్చిన తర్వాత కనికా కపూర్ కి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. తనకు కరోనా సోకిన విషయం తెలియని ఆమె అంతకంటే ముందుగానే ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరైన ఓ విందులో పాల్గొనడం వివాదాస్పదమైంది. ఆ తర్వాత వరుసగా చేసిన పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ అని రావడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నాలుగోసారి, ఐదోసారి కూడా కోవిడ్ టెస్ట్ పాజిటివ్ అని తేలడంతో వారి ఆందోళన మరింత అధికమైంది. కానీ ఎట్టకేలకు శనివారం నాటి పరీక్షల్లో కనికకు కోవిడ్ పరీక్ష ఫలితం నెగటివ్ అని తేలడంతో ఆమె కుటుంబసభ్యులు, అభిమానులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అయితే, మొదటి నుండి కూడా ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతుండటం గమనార్హం.
కనికా కపూర్‌కి ఆరోసారి కోవిడ్ పరీక్ష నెగటివ్ అని వచ్చినప్పటికీ.. ఏడోసారి కూడా నెగటివ్‌గానే వచ్చే వరకు ఆమె తమ పర్యవేక్షణలోనే ఉండాల్సిందిగా వైద్యులు స్పష్టంచేశారు. ప్రస్తుతం ఆమె లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SGPGIMS)లో చికిత్స పొందుతున్నారు.
Read Also: కరోనాతో 15 మంది ఎన్నారైలు మృతి
చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ప్రపంచంలో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 50,000 దాటింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..