Six Airbags for Cars: కార్లలో 6 ఎయిర్ బ్యాగ్‌లు తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం!
Six Airbags in Cars: ప్యాసింజర్ వాహనాలకు సంబంధించి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎం1 క్యాటగరీ వాహనాలకు ఆరు ఎయిర్ బ్యాగ్‌లు తప్పనిసరి చేసింది.
Six Airbags for Cars: భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 8 మంది వరకు ప్రయాణికులు ఉండే అన్ని ప్యాసింజర్ వాహనాలకు 6 ఎయిర్ బ్యాగ్‌లు తప్పని సరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం (Six Airbags mandatory for cars in India) ప్రకటించింది.
ఈ విషయాన్ని రోడ్డు రవాణా, హైవేస్ మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రయాణికుల భద్రతను మెరుగు పరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు (Nitin Gadkari on Airbags in cars) వెల్లడించారు.
ఆ క్యాటగిరీ కార్లన్నిటికి వర్తింపు..
ఇందుకు సంబంధించి ముసాయిదా జీఎస్ఆర్కు తాజాగా ఆమోదం ముద్ర వేసినట్లు పేర్కొన్నారు నితిన్ గడ్కరీ. ఎం1 క్యాటగిరీలోని అన్ని వాహనాలకు ఈ నిబంధన వర్తిస్తుందని వివరించారు. డ్రైవర్ సీటుతో పాటు.. ఎనిమిది కన్నా ఎక్కువ సిట్టింగ్ కెపాసిటీ లేని ప్యాసింజర్ వాహనాలన్ని ఎం1 క్యాటగిరీలోకి వస్తాయి.
ఇప్పటికే.. డ్రైవింగ్ ఎయిర్ బ్యాగ్‌ను 2019 జులై నుంచి తప్పనిసరి చేసినట్లు.. 2022 జనవరి 1 నుంచి కో-ప్యాసింజర్ (డ్రైవర్ పక్క సీటు) ఎయిర్ బ్యాగ్ తప్పనిసరి చేసిన విషయాన్ని గుర్తు చేశారు నితిన్ గడ్కరీ.
పూర్తి సురక్షితం..
ముందు వైపు నుంచి.. వెనకవైపు నుంచి జరిగే ప్రమాదాల వల్ల జరిగే నష్టాన్ని తగ్గించేందుకు అదనంగా 4 ఎయిర్ బ్యాగ్‌లను తప్పనిసరి చేసింది ప్రభుత్వం. వాహనాల్లో ప్యాసింజర్లందరికీ రక్షణ కల్పించే విధంగా ఇవి ఉపయోగపడనున్నాయని నిపుణులు అంటున్నారు.
తాజా నిర్ణయం అమలులోకి వస్తే.. దేశంలో వాహనాల భద్రత నిబంధనలు గతంలో ఎన్నడూ లేనంత పటిష్ఠంగా మారనున్నాయి ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనే విషయంపై కేంద్రం నుంచి ఇంకా స్పష్టత రాలేదు.
Also read: PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కుటుంబంలో ఎంతమందికి వర్తిస్తుంది..
Also read: IED Recovered in Delhi: ఢిల్లీలో ఐఈడీ బాంబు కలకలం... ఉగ్ర కుట్ర భగ్నం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook