PM Kisan Yojana: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 10వ విడత నిధులను కేంద్రం జనవరి 1న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.20 వేల కోట్లు దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమయ్యాయి. దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు డిసెంబర్ 1, 2018 నుంచి కేంద్రం ఈ పథకాన్ని అమలుచేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతీ ఏటా రూ.6 వేలు మూడు విడతల్లో అందిస్తున్నారు. అయితే ఈ పథకం ద్వారా ఒక కుటుంబంలో ఎంతమంది లబ్దిదారులుగా ఉండొచ్చు అనే సందేహం చాలామందిలో ఉండొచ్చు.
కేంద్రం నిబంధనల ప్రకారం... ఐదెకరాల లోపు ఉమ్మడి వ్యవసాయ భూమి లేదా సొంత భూమి కలిగిన చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది. 'కుటుంబం'కు కేంద్రం స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది. భార్య,భర్త, 18 ఏళ్ల లోపు పిల్లలను కలిపి కుటుంబంగా పరిగణిస్తోంది. కుటుంబంలో ఎవరో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. భార్యా, భర్తలు ఇద్దరి పేరిట పొలం ఉంటే.. ఇద్దరిలో ఒకరినే అర్హులుగా గుర్తిస్తారు. అర్హులను గుర్తించే బాధ్యతను కేంద్రం రాష్ట్రాలకే అప్పగించింది.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అనర్హులు ఎవరంటే :
ప్రస్తుతం లేదా గతంలో రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు.
మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మాజీ లోక్‌సభ సభ్యులు, ప్రస్తుత లోక్‌సభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్లు, ప్రస్తుత మేయర్లు, జిల్లా పంచాయతీ ఛైర్‌పర్సన్స్, మాజీ ఛైర్‌పర్సన్స్.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, కార్యాలయాలు, విభాగాల్లో సేవలు అందిస్తున్న ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తి గల సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు, అధికారులు, స్థానిక సంస్థల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులు (మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లాస్ IV, గ్రూప్ డీ ఉద్యోగులకు మినహాయింపు).
నెలవారీ పెన్షన్ రూ.10,000 కన్నా ఎక్కువ ఉన్న సూపర్ యాన్యుయేట్, రిటైర్డ్ పెన్షనర్లు (మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లాస్ IV, గ్రూప్ డీ ఉద్యోగులకు మినహాయింపు).
గత అసెస్‌మెంట్ ఇయర్‌లో ఆదాయపు పన్ను చెల్లించివారు.
డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్ లాంటి ప్రొఫెషనల్స్.
పైన పేర్కొన్న కేటగిరీకి చెందినవారు రైతు కుటుంబాల్లో ఉన్నట్లయితే... ఆ కుటుంబానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ (PM Kisan Samman Nidhi) వర్తించదు.
Also Read: IED Recovered in Delhi: ఢిల్లీలో ఐఈడీ బాంబు కలకలం... ఉగ్ర కుట్ర భగ్నం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి