కరెన్సీ కాయిన్స్ ముద్రణను నిలిపివేసింది కేంద్రం. నోయిడా, ముంబై, కోల్ కతా, హైదరాబాదు లో ఈ నాణేల ముద్రం జరుగుతుంది. ఈ కేంద్రాలలో ఇప్పటీకె 250 కోట్ల రూపాయల నాణేలు ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం గోదాముల్లో ఉన్నాయి.. కొత్తగా నాణేల ముద్రణ చేపట్టితే స్టోరేజ్ సమస్య ఏర్పాటుడుతుందని.. సమస్య జఠిలమవుతుందన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆల్రెడీ.. ముద్రించి రెడీగా ఉన్న నాణేలు మార్కెట్లో వెళ్ళడానికి మరికొంత సమయం పడుతుందని.. ఆ తరువాతే కొత్త నాణేల ముద్రణ చేపట్టుతామని వెల్లడించింది. ఈమేరకు దేశంలో ఉన్న అన్ని నాణేల ముద్రణ కేంద్రాలకు ఉత్తర్వులు జారీచేసింది. 


నాణేలు నిలిపివేయడం వల్ల మార్కెట్ పై ఎటువంటి ప్రభావం ఉండబోదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇప్పటికే వందల కోట్ల నాణేలు సిద్ధంగా ఉన్నాయని.. ముద్రణ ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు సహజమే అని చెప్పింది. అయితే దీనిపై స్పందించాల్సింది ముద్రణ కేంద్రాల ప్రతినిధులే.. వారికే అధికారం ఉందని ఆర్బీఐ స్పష్టం చేసింది.