Yogi Oath Taking: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగీ ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరుసగా రెండవసారి ముఖ్యమంత్రి కావడం యూపీ 37 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. వరుసగా రెండవసారి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. 37 ఏళ్ల యూపీ చరిత్రలో ఒకే వ్యక్తి వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి కావడం ఇదే తొలిసారి. అందుకే ఈసారి ప్రమాణస్వీకారం చాలా ఘనంగా జరగనుంది. మార్చ్ 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు లక్నోలోని ఎకనా స్డేడియం యోగీ ప్రమాణస్వీకారానికి సన్నద్ధమౌతోంది. ఒకేసారి 50 వేలమంది ప్రత్యక్షంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 


యోగీ ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకార మహోత్సవానికి ఏకంగా 2 వందలమంది వీఐపీలు హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ప్రతిపక్షనేతలకు కూడా ఆహ్వానాలు అందాయి. అలా ఆహ్వానాలు అందిన వారిలో సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత ములాయంసింగ్ యాదవ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.


మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 255 స్థానాలు గెలుచుకోగా.. దాని మిత్రపక్షం అప్నా దళ్ 12 స్థానాలు, మరో మిత్రపక్షం నిషద్ పార్టీ 6 స్థానాలు గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో 111 స్థానాలను సమాజ్‌వాదీ పార్టీ దక్కించుకుంది. కాంగ్రెస్ రెండు చోట్ల, బీఎస్పీ ఒక చోట విజయం సాధించింది.


Also read: Punjab: వేతనంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకుంటా.. పంజాబ్ కొత్త అడ్వకేట్ జనరల్ కామెంట్స్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook