జేసీబీలో మండపానికి వెళ్లిన పెళ్లికొడుకు.. భిన్నంగా జరుపుకోవాలని మాత్రం కాదు! కారణం ఏంటంటే? (వీడియో)
రథం, గుర్రం, కారు కాకుండా ఓ వరుడు జేసీబీలో వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో చోటుచేసుకుంది. పెళ్లికొడుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Groom reaches wedding venue on a JCB: పెళ్లి మండపానికి వరుడు గుర్రంపై లేదా రథాలపై రావడం భారతదేశంలో సర్వ సాధారణం. వారివారి సంప్రదాయాల ప్రకారం వరుడు మండపానికి వస్తుంటాడు. ఇటీవలి కాలంలో అయితే లగ్జరీ కారులలోనే పెళ్లికొడుకు (Groom ) మండపానికి వస్తున్నారు. అయితే రథం, గుర్రం, కారు కాకుండా ఓ వరుడు జేసీబీ (JCB)లో వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో చోటుచేసుకుంది. ఆ వరుడు జేసీబీలో రావడానికి ఓ బలమైన కారణం ఉంది.
ప్రస్తుతం శీతాకాలం కావడంతో హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో భారీగా మంచు కురుస్తోంది. మంచు కారణంగా అక్కడి రోడ్లు అన్ని బ్లాక్ అయ్యాయి. దాంతో పెళ్లికోసం పెళ్లికూతురు ఇంటికి పోవడానికి సిమ్లా (Shimla) జిల్లాలోని ఓ వరుడికి ఆటకం ఏర్పడింది. దాంతో అతడు జేసీబీని బుక్ చేసుకున్నాడు. మంచు కురుస్తున్నా.. ఆ వరుడు జేసీబీలో మండపానికి (Groom on JCB) వెళ్లాడు. పెళ్లి అనంతరం అమ్మాయిని కూడా అదే జేసీబీలో ఎక్కించుకుని ఇంటికి తీసుకుపోయాడు.
జేసీబీలో మండపానికి విచ్చేసిన పెళ్లికొడుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన అందరూ నవ్వుకుంటున్నారు. అంతేకాదు ఆ వీడియోకు లైకులు, కెమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'మంచి ఆలోచన' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'సూపర్ బయ్యా' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 'మంచు కురుస్తుంటే.. ఏం చేస్తాడు', 'భలే తెలివి', 'వెరైటీగా ఉంది' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్ పెళ్లికొడుకు వేరే ఆప్షన్ లేక జేసీబీలో మండపానికి వచ్చాడు కానీ.. ఓ పాకిస్తాన్ యువకుడు ఇటీవలి కావాలనే జేసీబీలో ఊరేగింపుగా వచ్చాడు. జీవితాంతం గుర్తుండిపోయేలా పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ పాకిస్తాన్ వరుడు.. లగ్జరీ కారును వదిలేసి జేసీబీలో వచ్చాడు. అంతకుముందు వరంగల్ జిల్లాకు చెందిన ఓ జంట రొటీన్‌గా కాకుండా భిన్నంగా జరుపుకోవాలని జేసీబీలో పెళ్లి ఊరేగింపును జరుపుకున్నారు.
Also Read: Kousalya Covid 19: కరోనా బారిన పడిన కౌసల్య.. తీవ్ర జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్న సింగర్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook