Group Captain Varun Singh, Lone survivor of Chopper Crash had close call last year, got Shaurya Chakra: తమిళనాడు కూనూర్‌ సమీపంలో నిన్న జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌తో (Chief of Defence Staff (CDS) General Bipin Rawat) పాటు ఆయన భార్య మధులిక, మరో 11 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఇంతమందిని బలికొన్న ఈ ఘోర ప్రమాదంలో ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనే  గ్రూప్‌కెప్టెన్‌ వరుణ్ సింగ్‌. (Group Captain Varun Singh) తమిళనాడు వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజీలో డైరెక్టింగ్‌ స్టాఫ్‌గా పని చేస్తున్నారు గ్రూప్‌కెప్టెన్‌ వరుణ్ సింగ్‌. ఈయన ఒక్కరే నిన్న జరిగిన బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్ సింగ్‌ (Indian Air Force’s Group Captain Varun Singh) ప్రస్తుతం వెల్లింగ్టన్‌లోని మిలటరీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే వరుణ్ సింగ్‌ హెల్త్ కండీషన్‌పై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమంటూ డాక్టర్స్ పేర్కొన్నారు. మెరుగైన చికిత్స కోసం ఆయన్ని బెంగుళూరు హాస్పిటల్‌కు తీసుకెళ్తున్నట్లు సమాచారం.


అయితే 2020లో కూడా ఒక విమాన ప్రమాదం నుంచి గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్​ సింగ్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అంతేకాదు... ఆ సాహసానికిగానూ 2021, ఆగస్టు15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వరుణ్ సింగ్‌కు శౌర్య చక్ర (Shaurya Chakra) అవార్డు ప్రదానం చేసింది ప్రభుత్వం. గతేడాది ఏరియల్‌ ఎమర్జెన్సీ సందర్భంగా వరుణ్ సింగ్ నడిపే ఎల్‌సీఎ తేజాస్‌ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్‌ను కాపాడినందుకుగానూ ఆయనకు శౌర్యచక్ర అవార్డు ప్రదానం చేశారు.


Also Read : Helicopter Blackbox Found: ప్రమాద హెలీకాప్టర్‌లోని బ్లాక్‌బాక్స్ లభ్యం, వేగవంతమైన వి


2020లో లైట్‌కంబాట్‌ ఎయిర్‌‌ క్రాఫ్ట్‌ (ఎల్‌సీఎ) (LCA) స్క్వాడ్రన్‌లో వరుణ్​ సింగ్ వింగ్ కమాండర్‌‌గా ఉన్నారు. అయితే గతేడాది అక్టోబర్ 12వ తేదీన విమానంలోని కొన్ని వ్యవస్థల్లో చేసిన మార్పులను టెస్ట్ చేసేందుకుగానూ ఎల్‌సీఏలోని ఒక విమానాన్ని చెకింగ్‌ తీసుకెళ్లారు వరుణ్. 


ఆ సమయంలో విమానంలో సమస్య ఏర్పడింది. సమస్యను వెంటనే గుర్తించిన వరుణ్‌ కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి ఎంతో జాగ్రత్తగా విమానాన్ని ల్యాండ్‌ చేశారు. ఆ సమయంలో విమానాన్ని వదిలిపెట్టి ప్యారాచూట్‌ ద్వారా వరుణ్ తన ప్రాణాల్ని కాపాడుకునే అవకాశం కూడా ఉంది. కానీ వరుణ్ అలా చేయకుండా...  ధైర్య సాహసాలతో పాటు నైపుణ్యాన్ని ప్రదర్శించి..విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్‌ చేశాడు. అలాగే వరుణ్ సింగ్ కూడా ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పుడు కూడా ఆయన మృత్యుంజయుడిగా రావాలని అందరూ కోరుకుంటున్నారు. వ‌రుణ్ సింగ్ (Varun Singh) ఉత‌రప్ర‌దేశ్‌లోని ధ‌నోలి గ్రామానికి చెందిన‌వారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని దేశమంతా ప్రార్థిస్తోంది.



 


Also Read : CDS Bipin Rawat: రావత్ ప్రయాణించిన హెలికాప్టర్​ క్రాష్​కు ముందు కనిపించిందిలా..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook