Monkeys snatch 2 months old baby and throw in to a water tank in Uttar Pradesh's Baghpat: ఒకప్పుడు అడవుల్లో ఉండే కోతులు (Monkeys).. ఇప్పుడు గ్రామాల్లోనే ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కోతులు గుంపులు (Monkeys Group) అరాచకాలు సృష్టిస్తున్నాయి. పంట పొలాలను అయితే నాశనం చేసున్నాయి. కోతుల బాధలు తట్టుకోలేక కొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న, వరి, కంది, పెసర, వేరు శనగ, పుచ్చకాయ, టమోటా, పత్తి లాంటి పంటలను వేయడమే మానేశారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఇళ్లలో దూరి జనాలను భయపెట్టి నిత్యవసర వస్తువులని కూడా తీసుకెళుతున్నాయి. అంతేకాకుండా చిన్న పిల్లలను కూడా ఎత్తుకెళ్లిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో చోటుచేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌ (Baghpat)లో ఆదివారం దారుణమైన ఘటన జరిగింది. బాగ్‌పత్‌కు చెందిన కేశవ్ కుమార్ దంపతులకు రెండు నెలల క్రితం ఓ పాప (2 Months Old Baby) జన్మించింది. డాబాపై ఉన్న గదిలో తన నానమ్మ పక్కన పాప పడుకుంది. ఇద్దరు గాఢ నిద్రలో ఉన్నారు. ఆ గదికి తలుపు తెరచి ఉండడంతో.. కోతులు గదిలోకి ప్రవేశించాయి. గదిలోని వస్తువులను కాకుండా.. నిద్రిస్తున్న రెండు నెలల పాపను అవి బయటకు తీసుకొచ్చాయి (Monkeys Snatch Baby). 


Also Read: Sid Sriram: కొత్త అవతారం ఎత్తనున్న స్టార్ సింగర్.. ఏకంగా మణిరత్నం సినిమాలో ఛాన్స్!!


పక్కన పాప లేదని గ్రహించిన కేశవ్ కుమార్ అమ్మ ఒక్కసారిగా కేకలు వేసింది. దాంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పసిబిడ్డ కోసం వెతకడం ఆరంభించారు. చివరకు పాప వాటర్ ట్యాంక్‌ (Water Tank)లో తేలుతూ కనబడింది. అప్పటికే చిన్నారి మృతిచెందింది.  దాంతో కేశవ్ కుమార్ కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో బాగ్‌పత్‌ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.


గతంలో కూడా కోతులు తమ బిడ్డను తీసుకెళ్లేందుకు ప్రయత్నించాయని, అప్రమత్తమవడంతో వదిలేశాయని పాప తల్లిదండ్రులు ఓ ప్రకటనలో తెలిపారు. కోతుల బెడద పెద్ద సమస్యగా ఉందని, అవసరమైన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులకు తెలియజేస్తున్నామని చాందినగర్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (SHO) ఓపీ సింగ్‌ పేర్కొన్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Monkey Video) అయింది. విషయం తెలిసిన అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: Sanjjanaa Galrani Pregnant: గుడ్ న్యూస్ చెప్పిన బుజ్జిగాడు హీరోయిన్.. త్వరలోనే తల్లి కాబోతున్న సంజన!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి