Changes in GST Rates to Take Effect from July 18: చండీగఢ్‌లో రెండురోజులపాటు జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కొత్త పన్ను రేట్లను ఖరారు చేశారు. కొత్తగా విధించిన పన్ను రేట్లు జూలై 18 నుంచి అమల్లోకి రానున్నాయి. వివిధ వస్తువులపై జీఎస్టీ పన్ను రేట్లు కింది విధంగా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెరిగిన జీఎస్టీ పన్ను రేట్లు ఇవే..!


* వంటింట్లో విరివిరిగా వినియోగించే ప్యాకింగ్, లేబుల్‌ వేసిన పాలు, పెరుగు, చేపలపై 5 శాతం జీఎస్టీ, బ్యాంక్ ఖాతాదారులకు అందించే చెక్‌ బుక్‌లపై 18 శాతం జీఎస్టీ విధింపు


* రూ.వెయ్యి కంటే తక్కువగా ఉన్న హోటల్‌ గదులపై 12 శాతం జీఎస్టీ..గతంలో ఎలాంటి జీఎస్టీ పన్ను ఉండేది కాదు.


* రూ.5 వేలు అంతకంటే ఎక్కువగా ఉన్న ఆస్పత్రుల గదుల్లో ఉంటే వస్తువులపై 5 శాతం జీఎస్టీ విధింపు


* గోధుమ పిండి, బెల్లం, ఉబ్బిన బియ్యం, ఎండు చిక్కుళ్లు, మకనా, సేంద్రీయ ఆహారం, కంపోస్ట్ ఎరువుపై 5 శాతం జీఎస్టీ


* లెదర్‌ ప్రాజెక్ట్‌, సోలార్ వాటర్ హీటర్‌లపై 5 శాతం నుంచి 12 శాతం జీఎస్టీ పెంచుతూ నిర్ణయం


* డ్రాయింగ్ ఇంక్, ప్రింటింగ్, ఎల్‌ఈడీ బల్బులకు ఉపయోగించే వస్తువులు, బ్రేడ్లు, ఫోర్క్‌, స్పూన్లపై విధించే పన్ను 12 శాతం నుంచి 18 శాతానికి పెంపు


జీఎస్టీ పరిధిలో తగ్గిన వస్తువుల వివరాలు..!


* ఆర్థోపెడిక్ సంబంధించిన వస్తువులపై 12 శాతం నుంచి 5 శాతానికి పన్ను తగ్గింపు


* రోప్‌ వేస్‌, ట్రాన్స్‌పోర్ట్ గూడ్స్‌పై జీఎస్టీ పన్ను 18 శాతం నుంచి 5 శాతానికి కుదింపు


* ట్రక్, సరుకు రవాణా వాహనాల అద్దెపై పన్ను తగ్గింపు


Also read:Mask Must in Telangana: తెలంగాణలో ఇక మాస్క్‌ తప్పనిసరి..ధరించకపోతే భారీ జరిమానా..!


Also read: Corona Updates in India: భారత్‌లో ఫోర్త్ వేవ్ రానుందా..ఇవాళ్టి కరోనా కేసులు ఎన్నంటే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook