పదో తరగతి పాసయ్యారా. అందులోనూ మీరు సింగిల్ గర్ల్ చైల్డ్‌గా ఉన్నారా. అయితే ఇలాంటి వారి కోసమే ప్రభుత్వం ప్రత్యేకమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) స్కాలర్‌షిప్ అందిస్తోంది. ఈ స్కీమ్ పేరు సీబీఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్. అమ్మాయిలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ సదుపాయాన్ని కల్పించింది. ఇందులో దరఖాస్తు చేసుకుంటే  పదో తరగతి పాస్ అయిన అమ్మాయిలకు ప్రతినెలా కొంత నగదు స్కాలర్‌షిప్ (CBSE Single Girl Child Scholarship 2020) అందనుంది.



 
సీబీఎస్ఈ అందిస్తున్న స్కాలర్‌షిప్‌ (Single Girl Child Scholarship 2020)లో భాగంగా రూ.500 మేర ప్రతినెలా చేతికి వస్తాయి. అయితే కేంద్ర ప్రభుత్వ విద్యా విధానం సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలలో టెన్త్ క్లాస్ చదివి ఉత్తీర్ణత సాధించిన బాలికలు ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పుడే పదో తరగతి పాస్ అయిన CBSE విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో పాత విద్యార్థులు తమ స్కాలర్‌షిప్ రెన్యూవల్ చేసుకోవచ్చు.


అప్లై చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి


 


సీబీఎస్ఈలో చదివి పదో తరగతి పరీక్షల్లో60 శాతానికి పైగా మార్కులతో ఉత్తీర్ణత సాధించిన సింగిల్ గర్ల్ చైల్డ్‌ను అర్హులుగా భావిస్తారు. అదే విధంగా 11వ తరగతి, 12వ తరగతులను సైతం సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో చదువుకుంటున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 28వరకు ఈ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook