Twitter Blue Ticks: ట్విట్టర్‌లో బ్లూ టిక్ వీరికి మాత్రమే.. ఎవరికో తెలుసా?

  • Nov 27, 2020, 08:24 AM IST

గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ హవా కొనసాగిస్తోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత, ప్రొఫెషన్ వివరాలు ఇందులో షేర్ చేసుకుంటున్నారు. వారి అప్‌డేట్స్, ఈవెంట్ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లకు, తమ అభిమానులకు చేరువ అయ్యేందుకు ట్విట్టర్‌‌ను వేదికగా మార్చుకున్నారు. అయితే ట్విట్టర్ ఖాతా తెరిచిన ప్రతి ఒక్కరికి బ్లూ టిక్ మార్క్ (Twitter Blue Ticks for 6 types of accounts) ఇవ్వరు. కేవలం వెరిఫైడ్ అయిన కొన్ని కేటగిరీల వారికి మాత్రమే ట్విట్టర్ బ్లూ టిక్ మార్క్ ఇస్తుంది. ఎవరెవరికి, ఏ సంస్థలకు వెరిఫైడ్ బ్లూ టిక్ మార్క్ ఇస్తుందన్న వివరాలు మీకోసం

1 /7

ట్విట్టర్ ఖాతా తెరిచిన ప్రతి ఒక్కరికి బ్లూ టిక్ మార్క్ (Twitter Blue Ticks for 6 types of accounts) ఇవ్వరు. కేవలం వెరిఫైడ్ అయిన కొన్ని కేటగిరీల వారికి మాత్రమే ట్విట్టర్ బ్లూ టిక్ మార్క్ ఇస్తుంది. ఎవరెవరికి, ఏయే సంస్థలకు ట్విట్టర్ (Twitter) వెరిఫైడ్ బ్లూ టిక్ మార్క్ ఇస్తుందన్న వివరాలు మీకోసం

2 /7

ఆయా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన ఖాతాలకు వెరిఫైడ్ బ్లూ టిక్ మార్క్ ట్విట్టర్ అందిస్తుంది.

3 /7

ప్రముఖ కంపెనీలు, బ్రాండ్లు, స్వచ్ఛంద సంస్థల ట్విట్టర్ అకౌంట్లను సంస్థ వెరిఫై చేస్తుంది. వారికి అధికారిక మార్క్ బ్లూ టిక్ ఇస్తుంది.

4 /7

ఎంతో ప్రాధాన్యత కలిగిన మీడియా రంగానికి చెందిన ట్విట్టర్ అకౌంట్స్‌, మీడియా ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలకు బ్లూ టిక్ ఇస్తారు. వివరాలు చెక్ చేసిన తరువాత ట్విట్టర్ ఈ టిక్ మార్కు అందిస్తుంది.

5 /7

సినిమా, టీవీ, వినోద రంగానికి చెందిన సంస్థలు, ప్రముఖుల ఖాతాలు వెరిఫై చేసి ఈ టిక్ మార్క్ అందిస్తారు.

6 /7

క్రీడా రంగానికి చెందిన సంస్థలు, ప్రముఖులకు ఈ టిక్ మార్క్ వస్తుంది. Also Read : ​WhatsApp OTP Scam అంటే ఏంటి ? దీని నుంచి తప్పించుకోవడం ఎలా ?

7 /7

సామాజిక కార్యకర్తలు, ఆర్గనైజర్స్, ఇతర ప్రముఖ వ్యక్తులు ట్విట్టర్ అకౌంట్లు వెరిఫై చేస్తారు. వీటికి ప్రాధాన్యత ఇస్తూ బ్లూ టిక్ మార్క్ ఇస్తారు.    Also Read : మార్కెట్‌లోకి కొత్త Honda Activa 6G.. పెట్రోల్ ఇక 10 శాతం ఆదా..