కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించడం తెలిసిందే. అయిగే ఈ సమయంలో వేటికి మినహాయింపు ఉంటుంది, ఏ పనులు చేసుకోవచ్చన్న దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు బుధవారం విడుదల చేసింది. మే 3 వరకు రైళ్లు, విమాన, మెట్రో సర్వీసుల రద్దు చేశారు. అయితే ఏప్రిల్ 20 నుంచి కొన్ని రంగాలకు మినహాయింపులు ఇస్తూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది.  పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర హోంశాఖ విడుదల చేసిన మార్గదర్శకాల వివరాలు....


  • రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వరంలోని వ్యవసాయ, మార్కెటింగ్ కార్యకలాపాలకు ఏప్రిల్‌ 20 నుంచి అనుమతి లభించింది. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, మండీలలో క్రయవిక్రయాలకు అనుమతి. ఆక్వా ఉత్పత్తుల క్రయవిక్రయాలకు అనుమతి

  • పాలకు సంబంధించిన ఉత్పత్తులు, పౌల్ట్రీ పరిశ్రమ, టీ, కాఫీ, రబ్బరు సాగు చేసుకోవచ్చు.

  • విత్తనోత్పత్తి సహా ఫర్టిలైజర్‌ షాపులు తెరవొచ్చు.

  • వైద్య సేవలు మినహా ఇతరత్రా ఏ పనులకు సరిహద్దులు దాటేందుకు అనుమతి లేదు 

  • బ్యాంకు కార్యకలాపాలు, ఈ కామర్స్‌ సంస్థలు, వాహనాలకు అనుమతి

  • ట్యాక్సీ సర్వీసులకు అనుమతి నిరాకరణ. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానాతో పాటు చర్యలు తీసుకుంటాం.

  • అంత్యక్రియలు లాంటి ముఖ్యమైన కార్యక్రమాలకు అధికంగా 20 మంది వరకు అనుమతి

  • మాల్స్, సినిమా థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, జిమ్లు, స్పోర్ట్ కాంప్లెక్స్‌లు, స్విమ్మింగ​ పూల్స్‌, బార్లు, ఆడిటోరియంలు మూసివేయాలి.

  • విద్యా సంస్థలు, ఇతరత్రా శిక్షణా కేంద్రాలు మూసివేయాలి. దైవ, మత కార్యక్రమాలపై నిషేధం. 

  • ఉపాధి హామీ పనులకు అనుమతి. అయితే ఉపాధి కూలీలు మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం (సోషల్‌ డిస్టాన్సింగ్‌) పాటించాలి.

  • ఆరోగ్య కేంద్రాలు, ఔషధాల విక్రయాలు యధాతథంగా సాగుతాయి. ఔషధ పరిశ్రమలు, పరిశోధనా కేంద్రాలలకు అనుమతి

  • వివాహ, ఇతరత్రా శుభకార్యాలకు జిల్లా కలెక్టర్‌ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి

  • ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, డీటీహెచ్‌, కేబుల్‌ సర్వీసులు యథాతథం.

  • ఎలక్ట్రీషియన్లు, మోటార్‌ మెకానిక్స్‌, ఐటీ రిపేర్లు, కార్పెంటర్ల సేవలకు అనుమతులు

  • వృద్ధాశ్రమాలు, అనాథశరణాలయాలు నిర్వహణకు అనుమతి

  • జాతీయ రహదారులు వెంట ఉండే దాబాలు, వాహన మరమ్మత్తుల దుకాణాలకు అనుమతి

  • 50 శాతం సిబ్బందితో పనిచేయడానికి ఐటీ కంపెనీలకు అనుమతి. అయితే ఉద్యోగులకు మాస్క్‌ తప్పనిసరి.


గమనిక: హాట్‌స్పాట్‌ కేంద్రాలుగా గుర్తించిన ప్రాంతాల్లో ఎటువంటి మినహాయింపులు ఉండవని హోంశాఖ తాజా మార్గదర్శకాలలో స్పష్టం చేసింది. హాట్‌స్పాట్‌ కేంద్రాలు, జోన్లను  జిల్లా, రాష్ట్ర అధికారులు ప్రకటిస్తారు. కాగా, హాట్‌స్పాట్‌ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక మార్గ దర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేయనుందని హోంశాఖ తన ప్రకటనలో పేర్కొంది.    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


 ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos


 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ


బుల్లితెర భామ టాప్ Bikini Photo