Attack on BJP candidate Piyush Patel in Gujarat Assembly Election 2022: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నిక 2022 తొలి విడత పోలింగ్‌ గురువారం (డిసెంబర్ 1) ఉదయం 8 గంటలకు మొదలైంది. తొలి విడుతలో సౌరాష్ట్ర, కచ్, దక్షిణ గుజరాత్‌ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఉదయం నుంచి ఓటింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. తొలి గంటలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే పోలింగ్‌ ఆరంభానికి ముందు ఓ బీజేపీ అభ్యర్థిపై దాడి జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాంసద నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న పీయూష్‌ పటేల్‌పై ఈరోజు తెల్లవారుజామున కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఝారీ గ్రామంలో ఆయన తన కారులో వెళ్తుండగా.. దుండగులు వాహనాన్ని ఆపి మరీ దాడి చేశారు. ఈ ఘటనలో బీజేపీ అభ్యర్థి పీయూష్‌ తలకు గాయమైంది. వాంసద నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి అనంత్‌ పటేల్‌ అనుచరులే ఈ దాడికి పాల్పడినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. దుండగులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. 


19 జిల్లాల పరిధిలోని 89 నియోజకవర్గాల ప్రజలు తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు 4.92 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తొలి గంటల్లో పలువురు ప్రముఖులు తాం ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ మంగూభాయ్‌ పటేల్‌, క్రికెటర్‌ రవీంద్ర జడేజా సతీమణి రీవాబా, గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్‌ ఇటాలియా సహా పలువురు ఓటు హక్కు వినియోగించుకున్నారు.


గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌, ఆప్‌ సహా 36 రాజకీయ పార్టీలు రేసులో ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌, ఆప్‌ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. వరుసగా ఏడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తుండగా.. పునర్వైభవాన్ని చాటాలని కాంగ్రెస్‌ ఇవ్వులూరుతోంది. మరోవైపు అధికారమే లక్ష్యంగా ఆప్‌ బరిలో దిగింది. బీజేపీ, కాంగ్రెస్‌ మొత్తం సీట్లలో అభ్యర్థులను నిలపగా.. ఆప్‌ 88 స్థానాల్లో బరిలోకి దింపింది. ఇక బీఎస్పీ 57 మందిని ఈ ఎన్నికల్లో నిలబెట్టింది. మరోవైపు 339 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 


Also Read: Bank Holidays December 2022: డిసెంబర్ నెలలో 14 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా ఇదే!  


Also Read: Gas Cylinder Price: సామాన్య ప్రజలకు ఊరట.. స్థిరంగా గ్యాస్ సిలిండర్ ధర!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.