Boat Accident: గుజరాత్లో ఘోర పడవ ప్రమాదం 16 మంది మృతి
Boat Accident: గుజరాత్లో ఘోర ప్రమాదం జరిగింది. పడవ బోల్తా పడటంతో 16 మంది మరణించారు. మరో 10 మందిని రక్షించారు. ఈ ప్రమాదం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Boat Accident: గుజరాత్ రాష్ట్రంలో వడోదరలో ఘోరం జరిగింది. మోట్‌నాధ్ సరస్సులో విహారయాత్ర సందర్భంగా పడవ బోల్తా పడటంతో 14 మంది విద్యార్ధులు, ఇద్దరు టీచర్లు మరణించారు. మరో 10 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
వడోదరలోని హరిణి మోట్‌నాథ్ సరస్సు పర్యాటకానికి ప్రసిద్ధి. న్యూ సన్‌రైజ్ స్కూలుకు చెందిన 27 మంది విహారయాత్రకు మోట్‌నాథ్ సరస్సుకు చేరుకున్నారు. వీరిలో 23 మంది విద్యార్ధులు, నలుగురు టీచర్లు ఉన్నారు. ప్రమాదవశాత్తూ పడవ బోల్తా పడటంతో 14 మంది విద్యార్ధులు, ఇద్దరు టీచర్లు మరణించారు. పదిమందిని కాపాడారు. మోట్‌నాథ్ సరస్సులో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విహారయాత్రకు వచ్చినవాళ్లు బోటింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
పడవలో ప్రయాణిస్తున్న 23 మంది విద్యార్ధుల్లో 11 మంది మాత్రమే లైఫ్ జాకెట్లు ధరించారని తెలిసింది. మిగిలివారు ఎలాంటి భద్రతా చర్చలు తీసుకోలేదు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. వడోదరలోని హర్ణి సరస్సులో జరిగిన ప్రమాదంలో విద్యార్ధులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు పూర్తి మద్దతు ఉంటుందన్నారు. మృతులకు 2 లక్షలు, అస్వస్థతో ఆసుపత్రిలో చేరినవారికి 50 వేలు పరిహారం ప్రకటించారు.
మరోవైపు ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సంతాపం వ్యక్తం చేశారు. అటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా స్పందించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Also read: Ayodhya Pran Pratishtha Time: గర్భగుడికి చేరుకున్న బాలరాముడు, మరో మూడ్రోజులు ఏం జరగనుంది
Also read: Udayanidhi Stalin: మరోసారి సంచలనం రేపిన స్టాలిన్, రామమందిరంపై కీలక వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook