Lungs Damage: ఈ అలవాట్లే ఊపిరితిత్తులను నాశనం చేస్తున్నాయి!

Lungs Damage Habits: చాలామందిలో ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. అయితే రోజు వారి జీవితంలో కొన్ని అలవాట్లు కారణంగానే ఈ సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏయే అలవాట్ల కారణంగా ఈ సమస్యలు వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Sep 29, 2024, 04:00 PM IST
 Lungs Damage: ఈ అలవాట్లే ఊపిరితిత్తులను నాశనం చేస్తున్నాయి!

 

Lungs Damage Habits: ఊపిరితిత్తులు మన శరీరానికి ఆక్సిజన్ అందించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి అందుకే ఈ ఊపిరితిత్తులను మన ప్రధాన అవయవంగా కూడా పిలుస్తారు. అలాగే ఇవి శరీరంలోని కార్బన్డయాక్సైడ్ ను బయటికి పంపించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. నిజానికి శరీరంలోని ఊపిరితిత్తుల పాత్ర లేకుంటే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే అవకాశాలున్నాయి. అందుకే చాలామంది ఊపిరితిత్తులను రక్షించుకోవడానికి వ్యాయామాలతో పాటు రోజువారి జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకుంటారు. అయితే ఆధునిక జీవన శైలి కారణంగా కొన్ని అలవాటులతో చాలామందిలో ఊపిరితిత్తుల దెబ్బతింటున్నాయి. అంతేకాకుండా వీటి పనితీరులో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. దీని కారణంగా కొంతమందిలో దీర్ఘకాలిక వ్యాధులతో పాటు ప్రాణాంతకమైన వ్యాధులు కూడా వస్తున్నాయి. అయితే నిజానికి ఎలాంటి అలవాట్ల కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయో? వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుండి.

ధూమపానం: 
ఊపిరితిత్తులు దెబ్బ తినడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అందులో ప్రధాన కారణం కొంతమందిలో ధూమపానం అలవాటు. ఈ అలవాటు కారణంగా కూడా సులభంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ తో పాటు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వ్యాధులు వస్తున్నాయి. దీని కారణంగానే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని ఇటీవల కొన్ని ఆరోగ్య పరిశోధనాల్లో తేలింది. అయితే ఇప్పటికే ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ధూమపానాన్ని మానుకోవాల్సి ఉంటుంది. 

పాసివ్ స్మోకింగ్:
సిగరెట్ కాల్చే వారి కంటే దానిని నుంచి వచ్చే పొగ చుట్టుపక్కల పీల్చేవారు ఎక్కువ ప్రభావితులవుతారని వైద్యులు చెబుతున్నారు. దీని కారణంగా కూడా చాలామందిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీన్ని వైద్య పరిభాషలో పాసివ్ స్మోకింగ్ అని అంటారు. దీనివల్ల కూడా కొంతమందిలో ఊపిరితిత్తులు విపరీతంగా దెబ్బతింటున్నాయి. కాబట్టి పోగా తాగేవారికి దూరంగా ఉండడం ఎంతో మంచిది. 

వాయు కాలుష్యం:
జీవనశైలి మారేకొద్ది వాతావరణంలో కూడా విపరీతమైన మార్పులు వస్తున్నాయి. దీని కారణంగానే వాయు కాలుష్యం ఏర్పడుతోంది. ముఖ్యంగా రోడ్డుపై తిరిగే వాహనాల సంఖ్య పెరగడంతో పాటు చెట్లు నరకడంతో వాతావరణంలో పొల్యూషన్ ఏర్పడి.. చాలామందిలో ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాతావరణం ఎక్కువ కాలుష్యం అయ్యే ప్రదేశాల్లో జీవించే వారిలో సులభంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా వస్తోంది. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

దుమ్ము, దూళి: 
పరిశ్రమలు ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా దుమ్ముదులి బయటకు వస్తూ ఉంటుంది. అయితే ఈ దుమ్ము దులిని పీల్చుకోవడం కారణంగా కూడా చాలామందిలో ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయని.. అంతేకాకుండా వాటి పనితీరు కూడా పూర్తిగా మారిపోతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి చోట్ల కొన్ని రోజుల పాటు జీవించడం వల్ల ఊపిరితిత్తుల పని పూర్తిగా ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని వారంటున్నారు. 

అతిగా మద్యం సేవించడం: 
చాలామంది రోజులో ఒక్కసారైనా మద్యం సేవిస్తూ ఉంటారు. నిజానికి అతిగా తాగడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటితో పాటు ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా మద్యం మానుకోవడం ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News