Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?
Gold Crown to Ram Lalla: రామాలయంలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట అనంతరం అయోధ్య కళకళలాడుతోంది. చిరకాల కల తీరడంతో భక్తులు రామయ్యను దర్శించుకునేందుకు బారులు తీరడంతో అయోధ్య కిటకిటలాడుతోంది. పెద్ద ఎత్తున వస్తున్న భక్తులు రామయ్యకు కానుకలు ఇస్తున్నారు. ఈక్రమంలోనే రెండో రోజే రామయ్యకు భారీ ఆభరణం వచ్చిచేరింది. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగిన స్వర్ణ కిరీటం రామయ్య శిరస్సుపైకి చేరింది.
Goledn Crown Donation: ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. రెండోరోజు మంగళవారం అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు. ఇప్పటికే బంగారు ఆభరణాలతో రామయ్య ధగధగలాడుతుండగా అతడి చెంతకు మరో ఆభరణం చేరింది. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి ముకేశ్ పటేల్ రాముడికి భారీ ఆభరణం అందించారు. నాలుగు కిలోల బరువు కలిగిన బంగారు కిరీటాన్ని రాముడికి సమర్పించారు.
అయోధ్యకు చేరుకున్న ముకేశ్ కుటుంబం ఆలయ ట్రస్ట్ ప్రతినిధులకు కిరీటాన్ని అందించారు. ముకేశ్ పటేల్ తన తల్లిదండ్రులతో ఆలయానికి వచ్చారు. బాలరాముడిని దర్శించుకున్న అనంతరం కిరీటాన్ని బహుకరించారు. స్వర్ణాభరణం అందించిన దాతలను ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తీర్థప్రసాదాలు అందించారు. ప్రత్యేక దర్శనం చేయించారు.
కిరీటం విలువ..
నాలుగు కోట్ల విలువైన ఈ స్వర్ణాభరణం విలువ రూ.11 కోట్లు ఉంటుంది. కిరీటం మొత్తం పూర్తి స్వచ్ఛమైన బంగారంతో తయారైంది. కొత్త డిజైన్‌లో కిరీటాన్ని రూపొందించారు. కిరీటంలో వజ్రాలు, విలువైన రాళ్లు, కెంపులు, ముత్యాలు పొదిగారు.
కానుకల వెల్లువ
అయోధ్యలో కొలువైన రామయ్యకు కానుకలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా భారీగా విరాళాలు చేపట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రజలు 20 లక్షల మంది ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. 12.7 కోట్ల కుటుంబాల నుంచి రూ.2,100 కోట్లు విరాళాలు వచ్చాయి. విరాళాల్లో భారీ విరాళం కూడా గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారినే అందించారు. దిలీప్ కుమార్ లాఖీ, ఆయన కుటుంబం అయోధ్య ఆలయానికి 101 కిలోల బంగారాన్ని విరాళంగా అందించారు. ఆ బంగారం విలువ రూ.68 కోట్లు ఉంటుంది. ఆ బంగారాన్ని ఆలయ తలుపులు, గర్భగుడి తదితర వాటికి వినియోగించారని సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook